నాకు సినిమాతో అనుబంధం ఫామ్ అవ్వడానికి రాజశేఖర్ గారే కారణం : దర్శకుడు సుకుమార్

Shekar Movie pre relese Event

Shekar Movie pre relese Event : డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం వలనే..అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి అన్నారు హీరో రాజశేఖర్.

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం లోని పాటలను విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా మే 20న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా “శేఖర్” ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ హోటల్ దస్పల్లా లో చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్, జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ, పాటల రచయిత రామజోగయ్య శాస్ట్రీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు సముద్ర ఖని, దర్శకుడు విజయ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్, కమెడియన్ శివారెడ్డి, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత రామసత్య నారాయణ , దొరసాని దర్శకుడు మహేంద్ర,, దర్శకుడు జ్ఞాన సాగర్, మరియు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ..నా జీవితంలో రాజశేఖర్ గారితో నిజమైన ఎక్స్పీరియన్స్ ముడిపడింది సినిమాకు సంబంధించి.ఆయన పీక్ లో ఉన్నప్పుఫుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు, మగాడు, అంకుశం, వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను తనకు ఎంతో వీరాభిమాని నయ్యాను. అప్పుడే మొట్ట మొదటి సారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్ ఇచ్చింది..దాంతో నేను మొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని దాంతో మా ఊర్లో నేను చాలా ఫెమస్ అయ్యాను. ఆ తర్వాత నన్ను స్కూల్ లో తనలా మాట్లాడమనే వారు. అలా.. నేను కూడా సినిమాల్లోకి రాగలను ఏమైనా చేయగలను అనే అనుబంధం ఫామ్ అవ్వడానికి మీరే కారణం ఇది అతిశయోక్తి కానే కాదు . అయితే ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెపుతున్నాము..ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్ ను ఇంత అద్భుతంగా మార్చినందుకు చాలా థాంక్స్. మనం మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకు రావడం చాలా గ్రేట్. జీవిత గారు చాలా హార్డ్ వర్కర్..తను ఫ్యామిలీ ని చూసుకుంటూ సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమా జీవిత గారి కోసం సక్సెస్ కావాలి. రామ జోగయ్య శాస్తి గారు అద్భుతమైన పాటలు రాస్తాడు. అనూప్ గారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా ఇలాగే వినయంగా ఉంటాడు. ఈ నెల 20 న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కు సుకుమార్, సముద్ర ఖని గార్లు రావడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు.కోవిడ్ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను.డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం…ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి. మే 20 న వస్తున్న మా సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి.అపుడే మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.ఈ సినిమా కోసం నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది.తనెంత కష్టపడింది అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే మా ఇద్దరు కూతుర్లు కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో జీవితకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకు ఇంత పేరు వచ్చిందంటే.. దానికి ముఖ్య కారణం అనూప్. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు.నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది అన్నారు.

దర్శకురాలు జీవితరాజశేఖర్ మాట్లాడుతూ..నేను అందరిలాగే సాధారణ మైన మనిషినే..నాకు ఊహ తెలిసినప్పటినుంది ఫైటింగ్ ఫైటింగ్.నేను ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు.నాకు చేతనైన సహాయం చేస్తా..అలాగే నాకు కూడా చాలా మంది హెల్ప్ చేశారు.నేను అడిగిన వెంటనే వారు ఏంతో బిజీ గా ఉన్నా ఈ ఫంక్షన్ కు వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన మీ మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి.ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ.. ఒకరికొకరు చేయూతనిస్తే.. తప్పకుండా ఈ ప్రపంచంలో అందరూ బాగుంటాము.కోవిడ్ తర్వాత అందరూ థియేటర్ కు రావడం లేదు ఓటిటి లోనే చూస్తారు అని చెప్పారు.నేను ప్రేక్షకులకు ఒకటే చెపుతున్నా ఈ సినిమా చాలా మంచి సినిమా.ఇప్పటివరకు మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించండి.టికెట్ రేట్స్ పెరగడం వలన ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని విన్నాను.మా వినిమకు టికెట్ రేట్స్ పెంచడం లేదు.గవర్నమెంట్ పెట్టిన రేట్లకే మా సినిమాను ప్రదర్శిస్తున్నాము.మా సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి బయ్యర్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పాము.ఈ సినిమా టికెట్ రేట్స్ మీకు అందుబాటు దరలోనే ఉంటాయి. దయచేసి మీరందరూ ఈ నెల 20 న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా సినిమా తప్ప వేరే లోకం ఉండదు. వారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

దర్శకుడు విజయ్ భాస్కర్ డైలాగ్ ప్రోమోను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటుడు సముద్ర ఖని మాట్లాడుతూ.. ఈ రోజు నేను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే మీ ఇన్స్పిరేషన్ వల్లే..అటువంటిది ఈ రోజు రాజశేఖర్ గారితో స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

సంగీత దర్శకుడు అనూప్ మాట్లాడుతూ..ఇది నాకు వెరీ స్పెసల్ మూవీ.జీవిత గారి ఫ్యామిలీ తో ఈ సినిమా కొరకు చాలా రోజులు జర్నీ చేశాను.ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

నటి శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అనూప్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. డిఓపి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా నిర్మాతలు రాలేకపోయినా వారెంతో మాకు సపోర్ట్ చేశారు.సినిమా స్టార్ట్ అవుతుందనగా నా వల్ల తనకు కోవిడ్ వచ్చింది. నా వల్ల తను చాలా సిక్ అయ్యాడు.ఒకానొక టైం లో డాక్టర్స్ వచ్చి చాలా సీరియస్ గా ఉంది.ఈ క్షణంలో నైనా వెంటిలేటర్ పై పెట్టచ్చు అన్నారు. దాంతో అందరూ నీ జాతకంలో దోషం ఉందేమో అనే వారు. ఆరు సంవత్సరాల నుండి నా సినిమా రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు నీ వల్ల మీ ఫ్యామిలీ కి కోవిడ్ రావడం అనే వారు.అయితే మా డాడీ నన్ను సపోర్ట్ చేశాడు.మాకు అమ్మ, నాన్నల దోరకడం దేవుడిచ్చిన వరం. మా కోసం కాకుండా మా నాన్న పునర్జన్మ లా తిరిగి వచ్చి చేసిన ఈ సినిమా మా నాన్నకు గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటి శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ.. మా సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఈ నెల 20 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.