దూబే ఎన్ కౌంట‌ర్ కాక‌పోతే..ఎమ్మెల్యే అయ్యేవాడు!

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దూబే ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో దూబే జీవితం గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అత‌ను గ్యాంగ్ స్ట‌ర్ మాగా మార‌డానికి కార‌ణాలు ఏంటి? గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన త‌ర్వాత అత‌ని నేర చ‌రిత్ర ఎలా పెరిగింది? యూపీ రాజ‌కీయ నేత‌ల‌తో అత‌నికున్న ప‌ర‌చ‌యాలు ఎలాంటివి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

కాన్పూరు జిల్లాలో బిక్రూ నివాసి అయిన వికాస్ దూబే 1990లో త‌న తండ్రితో కొంత‌మంది అన‌వ‌స‌రంగా కావాల‌ని గొడ‌వ పెట్టుకున్నారు. దీంతో దూబే వాళ్ల‌పై రాళ్లు రువ్వాడు. ఆ కేసులోనే తొలిసారి జైలుకెళ్లాడు. అయితే అప్ప‌టికే వికాస్ దూబే స‌మాజం ప‌ట్ల విర‌క్తి చెంది కొంత‌మంది అనుచ‌రుల‌ను కూడ‌గ‌ట్టాడు. అత‌ను అలా మార‌డానికి కార‌ణం స‌మాజం అని కొంత మంది వాద‌న‌. అందులో కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు ఉన్నారు. దీంతో ఆ కేసులో ఎఫ్ ఐర్ ఫైల్ కాకుండా చూసుకున్నాడు. ఆ త‌ర్వాత బీజేపీ బ‌హుజ‌న స‌మాజ్ వాజ్ వార్టీ కీల‌క నేత‌ల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. రాజ‌కీయంగా దూబేని వాడుకున్నారు. దూబే  కూడా ఆనాయ‌కుల్ని వాడుకున్నాడు. ఈ క్ర‌మంలోనే దూబే పోలీస్ స్టేష‌న్ లోనే రాష్ర్ట మంత్రిని హ‌త్య చేసాడు.

వికాస్ దూబే పై అప్ప‌టివ‌ర‌కూ న‌మోదైన కేసుల క‌న్నా అతి పెద్ద మ‌ర్డ‌ర్ కేసుగా ఇది నిలిచింది. దీంతో వికాస్ దూబే పేరు యూపీ మొత్తం మారుమ్రోగిపోయింది. ఆ త‌ర్వాత దూబే నేర సామ్రాజ్యాన్ని మ‌రింత విస్తృత ప‌రిచాడు. 90వ‌ ద‌శంక‌లో బ‌హుజ‌న స‌మాజ్ వాజ్ పార్టీ స‌భ్యుడిగా ఉండి స్థానిక రాజ‌కీయాల‌లో మంచి ప‌ట్టు సాధించాడు.  పంచాయ‌తీల్లో అత‌ని చెప్పిందే న్యాయంగా నిలిచేది. ఎన్నిక‌ల్లో అత‌ను నిలబెట్టిన వారిదే గెలుపు. దాదాపు 20 ఏళ్ల పాటు ఇలా చ‌క్రం తిప్పాడు. త‌ర్వాత దూబే భార్య‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చి గెలిపించుకున్నాడు. ఆ త‌ర్వాత త‌ల్లిని కూడా రాజ‌కీయాల్లోకి దింపాడు.

దీంతో దూబే రాజ‌కీయంగా, స్థానికంగా బాగా ఎదిగాడు. ఈ క్ర‌మంలో 2022 ఎన్నిక‌ల్లో తానే స్వ‌యంగా ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి రెడీ అయ్యాడు. కాన్పూర్ లోని దేహ‌త్ జిల్లా రానియో నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని పావులు క‌దుపుతున్నాడు. బీఎస్పీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడ‌ని, కానీ ప‌క్షంలో బీజేపీ లేదా ఇత‌ర పార్టీ నుంచి పోటీ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. పార్టీ ఏదైనా ఎమ్మెల్యేగా గెలిస్తే త‌న నేర చ‌రిత్ర‌ను క‌ప్పిపుచ్చుకోవ‌చ్చ‌ని భావించాడు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాద్ హ‌యాంలో ఎన్ కౌంట‌ర్లు పెరిగాయి. దీంతో దూబే ప‌లుకుబ‌డి పెంచుకునేందుకు..త‌నంటే ఓ భ‌యాన్ని పెంచేందుకు ఇటీవ‌ల 8 మంది పోలీసుల‌పై విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. అందులో డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నా ప‌ట్టించుకోలేదు. ఇదే వికాస్ దూబే చేసిన అతి పెద్ద త‌ప్పుగా మారింది. పోలీసుల‌పై కాల్ప‌ల‌కు తెగ‌బ‌డ‌క‌పోయి ఉంటే దూబే రాజకీయాల‌లోకి వ‌చ్చేవాడు. నేడు హ‌త‌మ‌య్యేవాడు కాదు.