కాపుల ఆశాజ్యోతి, కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా కాపు ఉద్యమనాయకుడిగా తప్పుకుంటు న్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దశాబ్ధాల క్రితం వంగవీటి రంగ తర్వాత మళ్లీ కాపు అనే ట్యాగ్ ను బలంగా చాటింది ముద్రగడ పద్మనాభమే. ఆయన వల్లే మళ్లీ కాపుల స్థాయి మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాపుల సమిష్టగా శ్రమిస్తే! ఎలా ఉంటుందో? అప్పటి టీడీపీ ప్రభుత్వానికి బాగా అర్ధమయ్యేలా చేసారు. తుని లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఘటన తర్వాత కాపు కులం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కాపులు ఉద్యమాల బాట పడితే ఎలా ఉంటుందో? ఆ ఉద్యమానికి ఎంత బలం ఉంటుందో? 27 శాతం ఉన్న కాపులు రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది? అన్ని రాజకీయ పార్టీలకు బాగా అర్ధమైంది.
అయితే ఆ ఉద్యమం వెనుక అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రగడ ఉద్యమానికి తెరలేపారని ప్రచారం సాగింది. దీనిపై ప్రస్తుతం కేసు కూడా నడుస్తోంది. ఇక బీసీ సామాజిక వర్గం తర్వాత ఏపీలో అధ్యధిక శాతం కాపు సామాజిక వర్గానిదే. ఏపీలో రాజకీయాలు చేయాలంటే బీసీలతో పాటు కాపులు అంతే కీలకం. అందుకే చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చి కాపు రిజర్వేషన్లపై బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అయితే ఈ బిల్లు కేంద్రానికి పంపండ అన్నది చంద్రబాబు ఆడిన గేమ్ అని అందరికీ తెలిసిందే.
50 శాతానికి మంచి ఉంటే కేంద్రం రిజర్వేషన్లకు అనుమతివ్వదు. ఇతర రాష్ర్టాల నుంచి ఇలాంటి బిల్లులు కేంద్రం వద్ద చాలానే పెండింగ్ లో ఉన్నాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల విషయంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చి చెప్పేసారు. ఇది రాష్ర్ట ఫరిదిలో అంశం కాదని…కేంద్రం చేయాల్సిన పని…జనగ్ మోహన్ రెడ్డి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసారు. ఇక ప్రస్తుతం కాపు కులానికి ఉద్యమనాయకుడే లేకుండా పోయాడు. ఈనేపథ్యంలో టీడీపీ నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ 13 జిల్లాల కాపుల్ని ఏకం చేస్తాననని…మళ్లీ కాపు ఉద్యమం సృష్టించాలని వ్యాఖ్యానించారు. అయితే అది జరిగే పనేనా? అంటే అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాపు ఉద్యమానికి బలమైన నాయకుడు కావాలి. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ కొమ్ము కాసిన కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ నాయకులు ఇప్పుడు ఎవరు ముందుకొస్తానన్నా? కాపులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ముద్రగడ ఉద్యమం చేస్తోన్న సమయంలో కాపు నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో చేరాలని రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు డిమాండ్ చేసాయి. కానీ అప్పుడు ఏ నాయకుడు ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు..జగన్ పాలనపై హర్షం వ్యక్తం అవుతోన్న సమయంలో కాపు నాయకులు ఆ కులాన్ని దువ్వే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది. ఇది జరగాలంటే? జగన్ పాలనపై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడే సాధ్యమవుతుందని కొంత మంది నాయకుల అభిప్రాయం.