చైనా దుస్సాహసానికి  గుణపాఠం చెప్పాలి  !

PM Modi 70th Birthday
 
 సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూ దొంగదెబ్బ కొడుతున్న  చైనాతో తేల్చుకునేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చైనాను కట్టడి చేసేందుకు మోదీ  తగిన వ్యూహాన్ని రచిస్తున్నారట. చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు ప్రధాని మోదీ ఈనెల 19న ఆల్ పార్టీ పిలుపుకు పిలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందంటూ భారత జవాన్ల మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై సోషల్ మీడియాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే  మోడీ సర్కార్ చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు సిద్ధపడుతుంది.
 
అయినా గత నెలరోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా ఇరుదేశాలు ఆర్మీ, దౌత్య భేటిలు నిర్వహిస్తున్నారు. ఇందులో చర్చలు కొలిక్కిరాగా ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు కొంతమేరకు వెనక్కి వెళుతున్న క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది.  చైనీయులు పక్కా ప్లాన్ తో రాళ్లు, కర్రలతో భారత జవాన్లపై దాడి దిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాత భారత జవాన్లు చైనా సైనికులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందగా చైనాకు చెందిన 35మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా చైనా ఆర్మీ ప్రకటించలేదు. 
 
అసలు భారత్-చైనా సరిహద్దుల్లోని లఢక్ ప్రాంతంలో ఏం జరుగుతుందో మోదీ సర్కార్ ప్రజలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు అన్నిపార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి చైనా అంశంపై అభిప్రాయాలు తీసుకోనునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్నిపార్టీల అధ్యక్షులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయాలని ఈ మేరకు ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో కోరింది.  ఈ బేటీలో సమష్టి నిర్ణయం తీసుకొని తదునుగుణంగా ముందుకెళ్లాల ని  చైనా దుస్సాహసానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు.