చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ సీక్రెట్ మీటింగ్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర  ఎన్నికల సంఘం కార్యదర్శి వేరు వేరుగా సుప్రీం కోర్టుకు వెళ్ళడం, త్రిసభ్య ధర్మాసనం స్టే ఇవ్వలేమని కేసును వాయిదా వేయడం తెలిసిందే.  ఆయన చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే నిమ్మగడ్డ  కమీషనర్ పదవిలో నిమ్మగడ్డ ఉండకూడదని ఏపీ సర్కార్ పట్టుబట్టి కూర్చుంటే నిమ్మగడ్డ కూడా తనను కావాలనే పదవి నుండి తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇడి రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడమేనని న్యాయ పోరాటం చేస్తున్నారు.  
ఇలా వివాదం పండిపోతుంటే తాజాగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలతో రహస్య సమావేశానికి వెళ్లారనే వార్తలు దుమారాన్ని రేపుతున్నాయి.  నిమ్మగడ్డ హైదరాబాద్లోని ఒక హోటల్లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లను పార్క్ హయాత్ హోటల్లో కలిసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.  ఈ నెల 13న సుజనా చౌదరి, కామినేని, నిమ్మగడ్డలు ఒకరి తరవాత ఒకరు హోటలహోటల్లోకి వెళ్లిన ఫుటేజెస్ బయటకు రావడంతో ఈ రహస్య సమావేశం సంగతి బయటికి పొక్కింది. 
వీరిలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీని వీడి భాజపాలోకి వెళ్లినా ఇప్పటికీ చంద్రబాబుకు పాత తరహాలోనే అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.  కామినేని సైతం చంద్రబాబుకు దగ్గరి మనిషి.  ఎన్నికల కమీషనర్ పదవి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డకు ఆయన చాలా సహకరిస్తున్నారు.  నిమ్మగడ్డ విషయమై హైకోర్టులో పిటిషన్ వేసిన వారిలో నిమ్మగడ్డ కూడా ఉన్నారు.  అంతేకాదు నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వరాదని సుప్రీం కోర్టులో కేవియెట్ కూడా వేశారు.  దీంతో వీరి సీక్రెట్ మీటింగ్ హైలెట్ అవుతోంది.  అసలు వీరి సమావేశంలో ప్రధాన ఎజెండా ఏమిటో తెలుసుకోవాలని వైసీపీ గట్టిగా ట్రై చేస్తోంది.