కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసారు. ట్రస్టుల నిర్వహణలో సంప్రదయాల పవిత్రతను ధర్మాసనం కాపాడిందన్నారు. ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రహించాలన్నారు. సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ లో జోక్యం మానేయాలని..కుటుంబం నడిపే ట్రస్ట్ లో పనేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి కౌంటర్ వేసారు.
నన్ను చైర్ పర్సన్ గా నియమించడం వల్ల సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ లపై గజపతి కుటుంబ హక్కులు పూర్తిగా సంరక్షించబడుతున్నాయి చంద్రబాబు గారు అంటూ సంచయిత కౌంటర్ ఇచ్చారు. నేను సంచయిత గజపతిని. నాతండ్రి ఆనంద గజపతికి అన్ని విధాలుగా తగ్గ వారసురాల్ని. మా తాతగారైన మహారాజా పీవీజీ గారికి మా తండ్రి ఆనంద జగపతి న్యాయపరమైన వారసుడు. మాతండ్రి ఆనంద గజపతికి నేను వారసురాల్ని. గజపతి ఫ్యామిలీ మొత్తానికి తానే వారసుడినని చెప్పుకుంటూ అహం ప్రదర్శిస్తున్న అశోక్ గజపతిలా కాకుండా, మీరు లింగ సమానత్వంపై గౌరవం చూపుతారని ఆశిస్తున్నట్లు సంచయిత పేర్కొన్నారు.
తాను గజపతి వారసత్వం కాదంటూ అశోక గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాడని మండిపడ్డారు. ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన వివాదం. మధ్యలో చంద్రబాబు లాంటి బయట వ్యక్తులు వారు జోక్యం చేసుకోవడం సబబు కాదంటూ హితవు పలికారు. మరి ఈ కామెంట్లపై అశోక్ గజపతిరాజు ఎలా స్పందిస్తారు? అన్నది చూడాలి. ఇటీవలే ఆనంద గజపతి రాజు రెండవ భార్యను, కుమార్తెను అంటూ ఇద్దరు మహిళలను అమెరికా నుంచి దిగారు. ఈ నేపథ్యంలో సంచయితపై పలు ఆరోపణలు చేసారు.