కేన్ మామ తండ్రి అయ్యాడు .. !

న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్‌సన్‌ బుధవారం తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. విషయానికి వస్తే.. కేన్‌ విలియమ్‌సన్‌ భార్య సారా రహీమ్‌ బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా విలియమ్‌సన్‌ తన బిడ్డను ఎత్తుకొని ఉ‍న్న ఫోటను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

Kane Williamson Blessed With Baby Girl Shares Adorable Picture Instagram - Sakshi

‘ చిట్టితల్లి.. మా జీవితంలోకి.. అలాగే కొత్త ప్రపంచానికి స్వాగతం.. నీ రాక మీ జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది.. ‘ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా తండ్రిగా ప్రమోషన్‌ అందుకున్న కేన్‌ విలియమ్‌సన్‌కు టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/CricCrazyJohns/status/1339105705899397120?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1339105705899397120%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fsports%2Fkane-williamson-becomes-proud-father-to-a-baby-girl-announces-news-on-instagram-sa-692078.html

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేన్‌ విలియమ్‌సన్‌ కివీస్‌ తరపున 151 వన్డేల్లో 6,173 పరుగులు.. 81 టెస్టుల్లో 6727 పరుగులు.. 60 టీ20ల్లో 1665 పరుగులు సాధించాడు.