ఎమ్మెల్యే రోజాకు తెలీకుండా ఆమె నియోజకవర్గంలోనే అంత పని చేశారా 

 

ఎమ్మెల్యే రోజాకు తెలీకుండా ఆమె నియోజకవర్గంలోనే అంత పని చేశారా 

 
ఎమ్మెల్యే రోజా.. ఎక్కడున్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించే వ్యక్తి.  తూటాల్లాంటి మాటలతో ఫైర్ బ్రాండ్ అనే పేరు సంపాదించుకున్న ఆమె తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకపోతే సొంత పార్టీ నేతల్ని కూడా వదలరు.  ప్రస్తుతం వైసీపీలో రోజా వెర్సెస్ డిప్యూటీ సీఎం అనే తరహాలో ఉందట వ్యవహారం.  బయట కార్యక్రమాల్లోనే తనను నిర్లక్ష్యం చేస్తే రోజాగారు సహించలేరు.  అలాంటిది సొంత నియోజకవర్గంలో ఆమెకు ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్ లేకపోతే ఆమె ఒప్పుకుంటారా.. ఒక ఆట ఆడేసుకోరా.  
 
తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాలు నగరి నియోజకవర్గం పుత్తూరులో పర్యటించారు.  సాధారణంగా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకుంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి తీరాలి.  అది ప్రోటోకాల్.  ఇక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ వారైతే ఆ ఎలివేషన్, హడావుడి ఎక్కువగా ఉంటాయి.  కానీ డిప్యూటీ సీఎం, రోజా విషయంలో ఈ సమన్వయమే లోపించింది.  
 
ఆమె నియోజకవర్గంలోనే ఉన్నా కూడా డిప్యూటీ సీఎం చెప్పకుండా వేరొక నియోజకవర్గ ఎమ్మెల్యేతో కలిసి పుత్తూరులో దళితుల కోసం కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి కావాల్సిన స్థలం కోసం పుత్తూరు బస్టాండ్ వద్ద పరిశీలన చేశారు.  ఈ సంగతి తెలిసిన రోజా నాకు తెలీకుండా నా నియోజకవర్గంలో ఇంత పని చేస్తారా.  కనీసం ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడుతూ ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదలకూడదని అనుకుంటున్నారట.  మరి లాక్ డౌన్ సమయంలోనే ఒక నీటి బోర్ ప్రారంభోత్సవానికి పూల వర్షం మధ్య వెళ్లొచ్చిన ఎమ్మెల్యే రోజాగారు తన నియోజకవర్గంలో తనను నిర్లక్ష్యం చేస్తే ఊరుకుంటారా.