ఇది జనసేన సాధించిన మరో విజయం 

ఏపీ ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ అమ్మకాల కోసం విశాఖ, గుంటూరు జిల్లాల్లో 18.8 ఎకరాల భూమిని సేకరించారు.  ఈ భూములను వేలంలో అమ్మి వచ్చిన డబ్బును సంక్షేమ పథకాల అమలు కోసం వాడాలని ప్రభుత్వం భావించింది. అమ్మదలచిన భూముల్లో గుంటూరులోని పి.వి.కె నాయుడు మార్కెట్ కూడా ఉంది.  ఈ మార్కెట్ ప్రాంతంల గుంటూరులో చాలా ప్రసిద్ది.  అనేక మంది చిన్న చిన్న వ్యాపారులు, కూలీలు, రైతులు ఈ మార్కెట్ మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. 
 
అలాంటిది ఈ మార్కెట్ అమ్మేస్తారని తెలియడంతో గుంటూరు జనం ఆందోళనకు గురయ్యారు.  అన్ని రాజకీయ పార్టీలు మార్కెట్ అమ్మవద్దని డిమాండ్ చేశాయి.  అయితే టీడీపీ ఆరంభంలో హడావుడి చేసినా ఆ తర్వాత మార్కెట్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  కానీ జనసేన గుంటూరు శ్రేణులు మాత్రం నిరసనను తెలుపుతూనే ఉన్నాయి.  సుమారు 10 రోజుల పాటు నిరసన దీక్షలు చేశారు.  స్థానిక జనం సైతం వారికి మద్దతు పలికారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను సంప్రదిస్తూ నిరసనకు పూర్తి మద్దతుగా నిలిచి వారిలో ధైర్యం నింపారు. 
 
మొదటి నుండి జనసేన కార్యకలాపాలకు మీడియా కవరేజ్ ఎలాగూ లేదు, సోషల్ మీడియాలో కూడా ఇతర రాజకీయ వ్యవహారాలు హైలెట్ అయ్యాయి కానీ ఈ దీక్షలు కాలేదు.  అయితే పబ్లిసిటీ లభించకపోయినా ఫలితం మాత్రం దొరికింది.  ప్రజా ఆస్తుల వేలం నుండి సర్కార్ ఈ మార్కెట్ ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈ మార్పులో మేజర్ క్రెడిట్ జనసేనకే దక్కుతుంది.  ఈ సందర్బంగా పవన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వరుస దీక్షలు చేసిన శ్రేణులకు, స్థానిల నాయకులకు అభినందనలు తెలిపారు.  ప్రభుత్వం మిగతా ఆస్తుల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.