హమ్మయ్య.. కేజ్రీవాల్ సేఫ్ 

 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోవిడ్ 19 పరీక్షలు చేయడం జరిగింది.  పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు అధికారికంగా వెల్లడించారు.  గత రెండు రోజులుగా కేజ్రీవాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురియ్యారు.  పైగా కేజ్రీవాల్‌కు  మధుమేహం  కూడా ఉండటంతో ఆయనకు వైరస్ సోకిందేమోననే అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. 
 
కానీ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.  ఆరోగ్య సమస్య నుండి కూడా మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు.  ఇక ఢిల్లీలో పరిస్థితి చూస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 27,654 దాటగా కోలుకున్న వారి సంఖ్య 10,664 గా ఉంది.  వైరస్ సోకి 761 మంది మరణించారు.  ఇంకా 17,000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తిగా పరిణామం చెందిందేమోననే అనుమానం ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.