రేషన్‌కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ కార్డు (Ration Card)కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉండేది. దీనిని కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆధార్ అనుసంధానం చేయని వారికి ఊరట కల్పించినట్లయ్యింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం..ప్రజలందరికి ఆహారం అందించాలి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే వారికి రేషన్ సరుకులను పొందాలంటే ఇబ్బంది మారింది. దీంతో దేశంలో ఒక్కడైన రేషన్ సరుకులు తీసుకోవచ్చని, అందుకు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.