రాజకీయ వ్యూహాలు రచించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకరు లేరు. ఇప్పటి వరకు ఆయన రచించిన వ్యూహాలకు ఎంతో మంది నాయకుల ఇళ్లకు పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు వైసీపీ ధాటికి తట్టుకోలేక టీడీపీ చాలా దీన స్థితికి చేరుకుంది. అయితే ఇప్పుడు పార్టీ యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీతో స్నేహం పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పురందేశ్వరీపై పుట్టుకొచ్చిన ప్రేమ
పురందేశ్వరీ జాతీయ నేత కాదు, జాతి నేతని వైసీపీ అధినేత విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తెగ హర్ట్ అయిపోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురంధరీశ్వరిని విమర్శించే స్థాయి నీకుందా అంటూ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే ఈ ప్రేమ వెనక చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం ఉందని, అందుకే టీడీపీ నేతలు ఇలా పురందేశ్వరీపై ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బలహీన పడ్డ పార్టీని బలపరచడానికి బీజేపీతో స్నేహంగా ఉంటూ పొత్తు పెట్టుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పండితులు చెప్తున్నారు.
అయ్యన్నపాత్రుడికి బీజేపీపై ఇష్టముందా!
బీజేపీపై అయ్యన్న చూపిస్తున్న ప్రేమను చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహమని కొందరు అంటుంటే మరికొందరు అయ్యన్నకు బీజేపీపై మక్కువ ఉండటం వల్లే బీజేపీ నాయకులపై ప్రేమ చూపిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతల ఇతర పార్టీల బాటలు పడుతున్న నేపథ్యంలో అయ్యన్న కూడా వెళ్లాడేమో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.