రాష్ర్ట విభజన తర్వాత అంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంతకంతకు వెనక్కి వెళ్లిపోయింది. ఏపీ పై కేంద్రంలో ఉన్న పార్టీల రాజకీయాలు కావొచ్చు…ఏపీలో ఉన్న పార్టీల రాజకీయాలు కావొచ్చు! కారణం ఏదైనా విభజన జరిగిన దగ్గర నుంచి ఏపీ ఆర్ధిక పరిస్థితి అదోగతే అయింది. ప్రత్యేక హోదాకి బధులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ చెప్పిన కేంద్రం దఫదఫాలుగా ఆ ప్యాకేజీ అందిస్తుంది. ఆ ప్యాకేజీ మొత్తం అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లూఠీ చేసిందని అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. ఇలా 2014 నుంచి 2019 వరకూ ఏపీ అప్పులు చేసి ముందుకెళ్లిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు పదవి క్లైమాక్స్ ఇయర్ లో నిరుద్యోగ భృతి, ఆ భృతి అంటూ కొన్ని పథకాలని ప్రవేశ పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు.
ఇది అందరికీ తెలిసిన నిజం. ఇక జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాది పాలనలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం 80 వేల కోట్లకు పైగా అప్పులు చేసారని ఇప్పటి ప్రతిపక్షం టీడీపీ ఆరోపణ. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి బ్యాంక్ అప్పులు ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం లేదన్నది వాస్తవం. కేంద్రం ప్రకటించే ప్యాకేజీ పాలనకు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఓ విదేశీ ట్రస్ట్ నుంచి ఏకంగా 65 వేల కోట్లు అప్పు చేస్తున్నారంటూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. జగన్ అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ఓ ట్రస్ట్ తో మంతనాలు జరిపి ఇప్పుడి అమెరికా డాలర్స్ ని ఇండియా కరెన్సీ రూపంలో అప్పుగా తెస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది.
ఇందులో వాస్తవం ఎంత? విదేశీ రుణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది పక్కనబెడితే ఓ సామాజిక వర్గానికి చెందిన మీడియా సంస్థలు మాత్రం తెగ నలిగిపోతున్నాయి. నెత్తి నోరు నేలకేసి కొట్టుకుంటున్నాయి. ఆ సంస్థ జగన్ ఎందుకు అప్పు ఇస్తున్నట్లు? జగన్ సర్కార్ గురించి అన్ని తెలిసే ఆ ట్రస్ట్ అంత ధైర్యం చేస్తుందా? ఒక వేళ అప్పు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? విదేశీ అప్పును బీజేపీ ఎలా ఒప్పుకుంటుంది? అంట అని ! ఇలా బోలడన్నీ లా పాయింట్లు లాగుతున్నాయి. అందులో ఓ సామాజికి వర్గానికి చెందిన వెబ్ సైట్ అయితే మరీ అత్యుత్సాహం చూపిస్తోంది. ఆ కథనాలన్ని ఏపీ ప్రజలు పేదరికంతో మగ్గిపోయి ఏమై పోయిన పర్వాలేదు. తాము మాత్రం ఇలాంటి కథనాలు ప్రచారం చేసి మానసిక ఆనందాన్ని పొందుతామని చెప్పకనే చెబుతున్నాయి. నిజంగా ఆ అమెరికా ట్రస్ట్ ఏపీ ప్రభుత్వానికి అప్పు ఇస్తే గనుక ఇంకెన్ని దాష్టికాలకు ఒడిగడతాయో.