ఇంత మాత్రానికే చంద్రబాబు పనైపోయిందని అనుకుంటే ఎలా 

abn rk losing journalistic values in kothapaluku

 

ఇంత మాత్రానికే చంద్రబాబు పనైపోయిందని అనుకుంటే ఎలా 

 
రాజకీయాల్లో పిరాయింపులు సర్వ సాధారణం.  వీటి మూలంగా అప్పటికప్పుడు పార్టీల సంఖ్యా బలం పెరగడమో, తగ్గడమో తప్ప ఇంకేమీ జరగదు.  ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెర తీసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ప్రతిపక్షం టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట.  ఈ దెబ్బతో టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడం జరుగుతుందని, ఇదే చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపని, టీడీపీకి కొత్త నాయకుడు రావాల్సిన అవసరం ఉందని చర్చలు జరుగుతున్నాయి.  
 
ఇక వైసీపీ సోషల్ మీడియా వర్గాలు అయితే చంద్రబాబు కథ కంచికే అన్నట్టు ప్రచారం చేస్తున్నాయి.  కానీ కేవలం పిరాయింపులు మూలంగానే పార్టీలు మూతబడతాయని, ఆ పార్టీల అధినేతలు పతనమైపోతారాని అనుకుంటే పొరపాటే.  అందునా నారా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు.  ఒక్కసారి గత పదేళ్ళ సమయం చూసుకుంటే 2012 సమయంలో టీడీపీ నుండి వైకాపాలోకి వలసలు జరిగాయి.  దాంతో ఇక బాబు పని గల్లంతే అనుకున్నారు.  
 
కానీ కట్ చేస్తే 2014లో బాబు తన రాజకీయ వ్యూహంతో శక్తులన్నింటినీ కూడదీసుకుని నవ్యాంధ్రకు మొదటి సీఎం అయ్యారు.  ఇక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు.  అప్పుడు కూడా ఇక జగన్ పార్టీ మూతేనని, చంద్రబాబు ముందు జగన్ ఎక్కడ సరిపోతాడని అన్నారు.  కట్ చేస్తే 2019లో వైఎస్ జగన్ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు.  
 
ఈ రెండు ఉదాహరణలు చాలు పిరాయింపులతో చంద్రబాబుకు సంఖ్యా బలం తగ్గుతుందేమో కానీ ఆయన పని మొత్తానికీ ఫినిష్ అయిపోదని చెప్పడానికి.  ఇక పిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి వస్తే అధికారం ఎటువైపు ఉంటే వారు అటు వైపు వెళుతుంటారే తప్ప పార్టీల భవిష్యత్తును, పార్టీ అధినేతల రాజకీయ జీవిత కాలాన్ని నిర్ధేశించే శక్తి వారికే మాత్రం ఉండదు.