ప్చ్.. తరుణ్!?

యువ నటుడు తరుణ్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. అయితే కొత్త సినిమా చేస్తున్నాడనే దాని గురించి కాకుండా సామాజిక మాధ్యమాల్లో అతని పెళ్లి సంగతి గురించిజోరుగా చర్చ సాగింది. ఇంతకీ విషయం ఏంటంటే తరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాగా వైరల్‌ అయింది. పెళ్లికూతురు మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అని వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవలే నీహారికి విడాకులు పుచ్చుకున్నారు.

ఇంకేముంది ఇద్దరికీ  నెటిజన్లు ముడేశాసారు. ఇంతకీ ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారో కానీ బాగా వైరల్‌ అయిపొయింది. పెళ్లివార్త వైరల్‌ కావడంతో చేసేదేముంది పాపం తరుణ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తరుణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ తో తెలుగులో చాలా సినిమాలు చేసాడు. విజయాలు సాధించాడు. ఇప్పుడు తరుణ్‌ సినిమాలు ఏవిూ చెయ్యడం లేదు, ఎందుకంటే తనకి నచ్చిన కథ దొరకటం లేదు అని అంటున్నాడు. సినిమాలు ఏవిూ చేయకున్నా, తరుణ్‌ ఇంతవరకు పెళ్లి చేసుకుండా బ్యాచిలర్‌ గా ఉంటున్నాడు కాబట్టి, ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో ఎవరితోటె జరగబోతుందని వార్తలు తెరవిూదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే వరుసలో తరుణ్‌ వివాహం
ఫిక్సయింది అంటూ సోషల్‌ విూడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం విూద ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్‌ విూడియా వేదికగా లేదా విూడియా ముఖంగా చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తు న్నాయో తెలియడం లేదని తరుణ్‌ అన్నారు. ఇలాంటి పుకార్లు తగవని కూడా అన్నారు.