నవంబర్ 3న రాబోతోన్న ‘విధి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన చిత్ర విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో..

నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మేకింగ్ కొత్తగా ఉంటుంది. రోహిత్, ఆనంది చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలకు సంగీతం చాలా ఇంపార్టెంట్. శ్రీ చరణ్ అద్భుతంగా ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమా చూస్తే ప్రేక్షకులకే ఆ విషయం తెలుస్తుంది’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రంజిత్ వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగింది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను మొదలుపెట్టారు. ఆయన ఒక వేళ తన వ్యాపారాన్ని పక్కన పెడితే.. ఆయనే మంచి కథలు రాసుకునేంత టాలెంట్ ఉంది. రోహిత్ ఎంత అద్భుతంగా నటించాడనేది నవంబర్ 3న ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆనంది చక్కగా నటించింది. ఆ ఇద్దరూ వేరే లెవెల్లో నటించారు. శ్రీ చరణ్ పనితనం ఏంటన్నది ప్రేక్షకులకు తెలుస్తుంది. అనుకున్న స్థాయికంటే ఎక్కువ ఆర్ఆర్ ఇచ్చాడు. మా బ్రదర్ శ్రీనాథ్‌తో కలిసి చిత్రాన్ని డైరెక్ట్ చేశాను’ అని అన్నారు.

ఎడిటర్, డీఓపీ, డైరెక్టర్ శ్రీనాథ్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు ‘విధి’మా సినిమా. నవంబర్ 3 నుంచి విధి ప్రేక్షకుల సినిమా. మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రంజిత్‌కు థాంక్స్. రోహిత్‌కు ఇది తొలి సినిమా అని నమ్మరు. అద్భుతంగా నటించాడు. శ్రీ చరణ్ అందించిన ఆర్ఆర్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. నవంబర్ 3న థియేటర్లోకి సినిమా రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

రోహిత్ నందా మాట్లాడుతూ.. ‘మా ‘విధి’ సినిమా నవంబర్ 3న రాబోతోంది. ఆ రోజు పొలిమేర 2, కీడా కోలా వంటి మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. మా సినిమాను బుక్ మై షోలో పెడితే వెంటనే సోల్డ్ అవుట్ అయ్యాయి. వర్క్ షాప్ అని వీధుల్లోకి తీసుకెళ్లారు. కూరగాయలమ్మేవారి వద్దకు తీసుకెళ్లారు. వారెలా ఉంటారో దగ్గరుండి చూపించి నాతో నటింపజేశారు. మమ్మల్ని ప్రోత్సహించిన దిల్ రాజు గారి కూతురు హన్షిత రెడ్డి గారికి థాంక్స్. విధి కోసం పెట్టిన కాంటెస్ట్‌కు చాలా రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ థియేటర్లో బాక్సాఫీస్ వద్ద మా ప్రతినిధి ఉంటారు. వారికి కోడ్ చూపిస్తే టికెట్ ఇస్తారు. ఎక్స్ ఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని థియేటర్‌కు వెళ్తే.. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు’ అని అన్నారు.

శ్రీచరణ్ పాకాలా మాట్లాడుతూ.. ‘నవంబర్ 3న మా సినిమా రిలీజ్ కాబోతోంది. నేను ఇది వరకు చాలా థ్రిల్లర్ మూవీస్ చేశాను. కానీ ఈ సినిమా కొత్తగా ఉండబోతోంది. రోహిత్, ఆనంది అద్భుతంగా చేశారు. ఓ పెన్ను గురించి కథ అంతా తిరుగుతుంది. క్షణం, ఎవరు లాంటి సినిమాలు చేసిన విధిని ఓ చాలెంజింగ్‌గా తీసుకున్నాను. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’ అని అన్నారు.