‘ది జర్నీ ఆఫ్ సింగ్ షాట్’.. జవాన్ సినిమా కోసం చిత్రీకరించిన ఈ హై యాక్షన్ సన్నివేశాన్ని చూసినప్పుడు హృదయం మనకు తెలియకుండానే సదరు యాక్షన్ సన్నివేశంపై లగ్నమవుతుంది. వెండితెరపై అలాంటి అద్బుతమైన, వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఆశ్చర్యపోకతప్పదు. అలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు జవాన్ సినిమాలో ఉన్నాయి.
ప్రేక్షకులు మెచ్చే ఇలాంటి మెస్మరైజింగ్ సన్నివేశాలను చిత్రీకరించటానికి కారణం హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పైరో రజటోస్. గతంలో ఆయన ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టల్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘జవాన్’ మేకర్స్ అసలు చిత్రీకరణ ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించటం స్పెషలిస్ట్ అయిన స్పైరో రజటోస్ కచ్చితమైన ప్రణాలిక, అంకిత భావంతో ఆయన ఈ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. మరీ ముఖ్యంగా సింగిల్ షాట్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. జవాన్ మేకింగ్‌లో స్పైరో రజటోస్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో గొప్పగా చిత్రీకరించటానికి ఆయన చేసిన కృషి ఫలితమిదేనని చెప్పొచ్చు.
జవాన్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. ఓ ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. సినిమాను చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని జవాన్ సినిమాను ఎంజాయ్ చేస్తారు. నటీనటులు చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. దానికి తోడు సాంకేతిక నిపుణుల పనితీరు మరింత బాగా కుదరటంతో జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిచారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది.