రాహుల్ విజయ్ కాప్ రోల్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA 2 పిక్చర్స్ మొదటి నుంచి మంచి విలక్షణమైన స్క్రిప్ట్స్ తో సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. భలే భలే మగాడివోయ్ , ప్రతి రోజూ పండగే , మహానుభావుడు లాంటి ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి సినిమాలను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ మరో సరికొత్త చిత్రంతో మన ముందుకి రావడానికి సన్నాహాలు కొద్దీ రోజుల క్రితం జరిగాయి. విమర్శనాత్మక చిత్రాలతో పేరు పొందిన తేజ మర్ని దర్శకత్వం లో బన్నీ వాసు గారి నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 8 ని హైదరాబాద్ ఫిలిం నగర్ లో పూజ లాంఛనాలతో ప్రారంభించారు. అల్లు అరవింద్ గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ చిత్రం.

ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల కనిపించనున్నారు . నేడు రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. రాహుల్ విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల అయినా పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పోలీస్ డ్రెస్ ధరించిన లుక్ లో కనిపిస్తున్నా రాహుల్ విజయ్ ని చూస్తుంటే పెద్ద మిస్టరీ ని ఛేదించే కథల అనిపిస్తుంది.

మొత్తానికి మరో కొత్త ఓరియెంటెడ్ చిత్రం తో వస్తుంది GA 2 సంస్థ. చిత్రం యూనిట్ తరపున మరోసారి రాహుల్ విజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. చిత్రం నుంచి మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.