Telugu Velugu Germany: తెలుగు వెలుగు జర్మనీ – ఉగాది ఉత్సవాలు 2025, ఫ్రాంక్‌ఫర్ట్

ఫ్రాంక్‌ఫర్ట్, ఏప్రిల్ 6, 2025: తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఫ్రాంక్‌ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late శ్రీ సాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా స్మరించారు. ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా నిలుస్తున్నాయని జెనెరల్ శెక్రెటరి శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు పేర్కొన్నారు.
“ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చూపిన దారి మాకొక దిక్సూచి. ఆయన స్వప్నాన్ని నెరవేర్చే బాధ్యతను మేము అందరం మోస్తాం,” అని ఆయన అన్నారు.

సంఘం ప్రెసిడెంట్ శ్రీ ఫ్రభంజన్ గాదెల హజరు కలెనందు వలన అయన సభ్యులకు మరియు అధితులకు ఉగాది మరియు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకకు ఫ్రాంక్‌ఫర్ట్ బర్గర్‌మాస్టర్ శ్రీమతి నసరిన్ ఎస్కందారి-గ్ర్యూన్‌బర్గ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, జర్మనీలో తెలుగు సమాజానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. బహుళసాంస్కృతిక సమాజాన్ని ప్రోత్సహించడంలో ఫ్రాంక్‌ఫర్ట్ నగరం చేస్తున్న కృషికి తెలుగు వెలుగు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు, ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్రాంక్‌ఫర్ట్ ప్రాంతంలో తెలుగు సమాజానికి అందుతున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు కమ్యూనిటీ ఇటీవల వేగంగా ఎదుగుతుందని, కొత్తగా చేరిన కుటుంబాలను మన తెలుగు వెలుగు కుటుంబంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. “ఇలాంటి వేడుకలు మనందరినీ కలిపి, ఒకరికొకరు తెలుసుకునే వేదికగా నిలుస్తాయి. మన ఐక్యతే మన బలం,” అని అన్నారు.

ఈ ఉగాది సంబరాల్లో పిల్లలు, యువత మరియు కళాకారులు అందించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని విజయవంతం చేయడంలో సంఘం క్యాల్చరల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రీతం బొడా విట్టల్ గారు తమ అంకితభావంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే సంఘం ట్రెజరర్ శ్రీ ఆదర్శ్ వంగల గారు సంఘం ఆర్థిక పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈవెంట్ విజయవంతానికి కీలకంగా వ్యవహరించారు.

ఈ ఉత్సవం విజయవంతంగా పూర్తవ్వడంలో ప్రతీ వాలంటీర్, ప్రతీ సభ్యుని సహకారం అనతిదోపరి. సంఘం వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది.

అదేవిధంగా, 2026లో తెలుగు వెలుగు జర్మనీ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నట్లు శ్రీ వెలగా గారు తెలిపారు.

“ఈ మైలురాయిని మేము ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీతో పంచుకుంటాం,” అని తెలియజేశారు.

ఈ ఉగాది వేడుకలు ఒక గొప్ప విజయంగా నిలిచాయి. ఇది మన తెలుగు భాష, సంస్కృతి, ఐక్యత, మరియు పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచింది.

ఈ ప్రకటన – తెలుగు వెలుగు జర్మనీ కమిటీ తరఫున విడుదల చేయబడింది.

అధిక సమాచారం కోసం:
Email: info@teluguvelugu.de
Website: www.teluguvelugu.de