Arabia Kadali: మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’ ట్రైలర్తో ఆసక్తి రేపుతున్న సత్యదేవ్!

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి. మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్! ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ‘అరేబియా కడలి’ ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది.

క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి. సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది.

ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి. సత్యదేవ్ ‘బదిరి’ పాత్రలో, ఆనంది ‘గంగ’ పాత్రలో ఒదిగిపోయినట్లున్నారు. ఇతర నటులైన నజర్, రఘు బాబు వంటివారు కూడా సిరీస్కు మరింత బలం చేకూర్చారు.

దర్శకుడు సూర్య కుమార్ మాట్లాడుతూ, “ఇది కేవలం బ్రతకడం గురించి కాదు, మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుంది” అని చెప్పడం సిరీస్ థీమ్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు.

Arabia Kadali - Official Trailer | Prime Video India

సత్యదేవ్ తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన “కెరీర్లో అత్యంత తీవ్రమైన మరియు సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటి” అని అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పారు.

ఆనంది కూడా తన ‘గంగ’ పాత్ర గురించి మాట్లాడుతూ, అందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని, అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ట్రైలర్లో కనిపించిన నటీనటుల అద్భుతమైన నటన, నేపథ్య సంగీతం సిరీస్కు మరింత బలం చేకూర్చాయి

డాక్టర్ కక్కుర్తి || Social Activist Krishna Kumari EXPOSED Srushti Test Tube Baby Center Scam || TR