తంతిరం అక్టోబర్ 6న వరల్డ్ వైడ్ గా బ్రహ్మాండమైన విడుదల…

కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం.

తాజాగా ఈ సినిమానీ ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.ఈ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.

ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన ఈ ఈ సినిమా నీ తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ను అందుకుంది.

ఆడియో రైట్స్ నందుకున్న సరిగమ సంస్థ ఈరోజు జ్యూక్ బాక్స్ ద్వారా ఆడియో రిలీజ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం ఓ టి టి సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు నార్త్ ఇండియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలయన్స్ సంస్థ గ్రాండ్గా అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్ధమయింది.

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి

దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )
సంగీత దర్శకులు: అజయ్ అరసడ
సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్
ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,
దీరు – ప్రసాద్ లింగం