తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఒదెల-2 కోసం’ కోసం చేతులు కలిపారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.
హై-బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించింది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.
ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయగల ఎబిలిటీ వున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, ‘ఓదెల 2’ ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో