Suvarna Textiles: సువర్ణ టెక్స్టైల్స్ ఫస్ట్ లుక్ విడుదల

Suvarna Textiles: శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్ నామిని రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సువర్ణ టెక్స్టైల్స్ ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండు షెడ్యూల్లలో షూటింగ్ కంప్లీట్ చేసి… ఆగస్టులో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత అనిల్ తెలిపారు. ఫస్ట్ లుక్ కి యూత్ లో మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఇందులో యూత్ కి నచ్చే కొంత అడల్ట్ కంటెంట్ కి కామెడీని కూడా జోడించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు.

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నామిని
నిర్మాత: అనీల్ ఈరుగుదిండ్ల
సినిమాటోగ్రఫీ: చందు ఎ.జె
సంగీతం: భరత్ M
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ఆర్ట్: విజయ్ కుమార్ గాజుల
లిరిక్స్: రాంబాబు గోసల
PRO: దుద్ది శ్రీను

చంద్రబాబు మాయం || Analyst Ks Prasad Full Clarity On Chandrababu Lokesh London Trip Secret || TR