Santosh South Indian Film Awards: ఏపీ హోంమంత్రి అనితకు సురేష్ కొండేటి ఆహ్వానం

యాంకర్: సంతోషం అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరుకావాలంటూ ఏపీ హోంశాఖ మంత్రి అనితకు ఆహ్వానం అందించారు సంతోషం అధినేత సురేష్ కొండేటి.

ఆ వివరాలు..

వాయిస్: సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి. సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారు.

మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి సంతోషం అవార్డ్స్ ఈవెంట్‌కు ఆహ్వానించిన సురేష్ కొండేటి తాజాగా బుధవారం ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు. సంతోషం అవార్డ్స్ కార్యక్రమానికి రావాలంటూ మంత్రి అనితను ఆహ్వానించారు. సంతోషం అవార్డ్స్ ఆహ్వాన పత్రికను అందజేసి తప్పకుండా కార్యక్రమానికి రావాలంటూ మంత్రిని కోరారు సురేష్ కొండేటి. సురేష్ కొండేటి ఆహ్వానంపై మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు.

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి మ్యూజిక్ పాట్నర్ గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు. ఈ కార్యక్రమానికి సూర్య సిమ్, విజయ వారహి మూవీస్ సంస్థ మరియు వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా వెన్ లాక్ గ్రూప్ సంస్థ వ్యవహస్తున్నారు. అలాగే ఈ సారి అవార్డ్స్ కార్యక్రమంగా ఆకాశాన్నంటేలా ఉంటుందని, టాలీవుడ్‌తో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి వెల్లడించారు.

Pulivendula Public Reaction On ZPTC Elections || Ys Jagan Vs Chandrababu || TDP Vs YCP || TR