సుధాకర్ కోమాకుల ‘నారాయణ & కో‘ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల ప్రస్తుతం చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ , సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నారాయణ & కో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. “’ఎక్స్ పీరియన్స్ ది తిక్కల్ ఫ్యామిలీ’ అని పోస్టర్ పై వుండటం ఇంట్రస్టింగా వుంది. ఇది ఒక విలక్షణమైన కుటుంబం, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అందరూ పగలబడినవ్వుతూ కనిపించారు. ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. నారాయణ & కో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతోంది.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

సాంకేతిక విభాగం:
బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
నిర్మాతలు: పాపిశెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల
సహ నిర్మాత: శ్రీనివాస్ గొర్రిపూడి
అసోసియేట్ నిర్మాత: శరద్ గుమస్తే, రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల & నాగ వంశీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
డీవోపీ: రాహుల్ శ్రీవాత్సవ్
అడిషినల్ DOP: సిద్దం మనోహర్
కథ: రవితేజ జి
డైలాగ్స్: రాజీవ్ కె
సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్ & ప్రణతి.
కొరియోగ్రఫీ: విజయ్ పోలాకి & మోహన్ కృష్ణ
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
కాస్ట్యూమ్ డిజైనర్: మానస నాయుడు ఎ
పబ్లిసిటీ డిజైనర్: మాని
ఆర్ట్ డైరెక్టర్: రవి దొండపాటి
ప్రొడక్షన్ మేనేజర్: టేకుమూడి రాజు
పీఆర్వో : వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హాష్‌ట్యాగ్ మీడియా
లైన్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ రెడ్డి వెన్నపూస
క్యాషియర్: కిరణ్ అనుభమ్