శివకార్తికేయన్ #SK21 టైటిల్ టీజర్‌ ఫిబ్రవరి 16న విడుదల

స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ కి సంబధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 16న #SK21 టైటిల్ టీజర్‌ ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక స్టన్నింగ్ వీడియో ని షేర్ చేశారు. ఈ వీడియో శివకార్తికేయన్ జిమ్ లో ఇంటెన్స్ వర్క్ ఔట్స్ చేస్తూ కనిపించారు. అలాగే డిఫరెంట్ గన్స్ ని ఫైర్ చేస్తూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.

#SK21లో శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. ‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.

అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ గా స్టీఫన్ రిక్టర్ పని చేస్తున్నారు.

తారాగణం: శివకార్తికేయన్, సాయి పల్లవి

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్లు: RKFI, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
సహ నిర్మాత: గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయి
ఎడిటర్: కలైవానన్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్
పీఆర్వో: వంశీ-శేఖర్