కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇంకా ఐశ్వర్య రజనీకాంత్ ల విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా 18 సంవత్సరాల వీళ్ళ పెళ్లి జర్నీని విడాకులతో ఆపేయడం చాలామందికి షాక్ గానే వచ్చింది. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ తమ విడాకులను సోషల్ మీడియాలో తెలపగా అభిమానులు చాలా బాధపడ్డారు. విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ప్రతి జంటకి కోర్టు వాళ్ళ నిర్ణయం మార్చుకునేందుకు కొంత సమయం ఇస్తుంది.
అలాగే ధనుష్, ఐశ్వర్యలకు కూడా కోర్టు కొంత సమయాన్ని ఇచ్చింది. ఈ సమయంలో మధ్యవర్తలు, రజనీకాంత్ లాంటి పెద్దలు వీళ్ళిద్దరిని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేయగా వీరిద్దరూ మాత్రం మాటంటే మాటే అన్నట్టు విడాకులు కావాలి అని కోరారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా హాజరై విడాకుల మీద వాళ్ళ నిర్ణయం ఏ మాత్రం మారదు అని కచ్చితంగా చెప్పడంతో ఈ హియరింగ్ ఈనెల 27కి వాయిదా పడింది.
ఇద్దరూ విడాకులు కావాలి అని అనడంతో ఆల్మోస్ట్ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసేస్తాది. వయసులో ధనుష్ కన్నా ఐశ్వర్య పెద్దది. ధనుష్ సోదరి, ఐశ్వర్య ఇద్దరు స్నేహితులు. ఈ విధంగానే ధనుష్ ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు. వీళ్ళిద్దరి పెళ్లి తర్వాత ధనుష్ కెరీర్ యూ టర్న్ తీసుకుంది. ధనుష్ కి రజినీకాంత్ అభిమానుల సపోర్ట్ కూడా రావడంతో ఎక్కడా లేని ఫ్యాన్ బేస్ నీ తన సొంతం చేసుకున్నాడు.
ఈ విడాకుల తర్వాత రజనీకాంత్ అభిమానులు ధనుష్ మీద వారి నిరాశను చూపించారు. కేవలం స్టార్ డం కోసమే ఐశ్వర్యన్ని పెళ్లి చేసుకున్నాడేమో అన్న వార్తలు కూడా ఈ మధ్య చాలా వచ్చాయి. వీళ్లిద్దరికీ విడాకులు అవ్వకపోయి ఉంటే రజినీకాంత్ ధనుష్ మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉండేదేమో అన్న అభిమానుల ఆశ నిరాశగా మిగిలింది. ఇప్పటికే విడివిడిగా ఉంటున్న ధనుష్, ఐశ్వర్యలు ఒక్కసారి విడాకులు మంజూరి అయితే ఎవరి దారి వారు చూసుకుంటారు.