Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ఈ మూవీతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితో సినిమా మొత్తం ప్రొడక్షన్ పూర్తవుతుంది. సైమల్టేనియస్‌గా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఈ నెలలో ఈ సినిమా మొదటి పాటను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తెలుసు కదా మనసు హత్తుకునే కథ. ఇది లవ్, పర్శనల్ గ్రోత్, రిలేషన్షిప్స్ మధ్య సాగుతుంది. అద్భుతమైన ఎమోషన్, హ్యుమర్ తో ప్రేక్షకులని అలరించబోతోంది.

ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్‌గా కనిపిస్తూ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జ్ఞాన శేఖర్ బాబా, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌, షీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

తెలుసు కదా సినిమా ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్

దేవర 2 లేనట్టేనా || Cine Critic Dasari Vignan Reveals Shocking Truth About Devara 2 || Telugu Rajyam