Ramani Kalyanam: దీప్శిక, సూర్య వశిష్ట, “రమణి కళ్యాణం” టైటిల్ గ్రాండ్ గా లాంచ్

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. ఈరోజు చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు.

కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోతున్నారు.

ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ తిరుకోవెల డీవోపీ, రవితేజ గిరిజాల ఎడిటర్. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్, విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు.

The Girlfriend Movie Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ!

Jatadhara Movie Review: ‘జటాధర’ మూవీ రివ్యూ!

Premistunnaa Movie Review: ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ

కోర్ట్ సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

“రమణి కళ్యాణం” తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.

నటీనటులు: దీప్శిక, సూర్య వశిష్ట, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల

రచన & దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి
డైలాగ్స్: రామ్ జగదీష్
స్క్రీన్ ప్లే: యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్, విజయ్ ఆదిరెడ్డి
సంగీతం & స్కోరు – సూరజ్ ఎస్ కురుప్
డిఓపి – అరవింద్ తిరుకోవెల
ఎడిటర్: రవితేజ గిరిజాల
కొరియోగ్రఫీ: విజయ్ పోలాకి, షెరీఫ్. ఎం
సాహిత్యం: పూర్ణాచారి చల్లూరి
ఆర్ట్ డైరెక్టర్: నానాజీ కచాల(నాని)
పీఆర్వో: తేజస్వి సజ్జా

KS Prasad Attacks Vangalapudi Anitha Over Vizag Drug Container | Jagan | Telugu Rajyam