ప్రవీణ్ ఐపీఎస్ కు క్లీన్ యు సట్టిఫికెట్ , త్వరలో థియేటర్స్ లో విడుదల!!!

ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రవీణ్ ఐపిఎస్”, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి, క్లీన్ యు సట్టిఫికెట్ పొందడం విశేషం.

నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ఐపిఎస్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి పాల్గొన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది.

ప్రవీణ్ ఐపిఎస్ గ్లిమ్స్ అందరిని ఆకర్షించే విధంగా,ఆలోచింపజేసే విధంగా, చాలా పవర్ ఫుల్ గా ఉంది. ట్రైలర్ కూడా అదే తరహాలో ఉంటుందని సమాచారం. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఏడు సంవత్సరాల ఐపిఎస్ సర్వీస్ ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి రాయకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే కోణంను చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం ప్రవీణ్ ఐపిఎస్. ఈ సినిమాలో తను చేసిన పోలిస్ సర్వీస్ ను అలాగే తను ఎదుర్కొన్న అణిచివేతను పోలీసు అధికారిగా, గురుకుల సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా చేసిన సేవలను ఈ సినిమాలో చూపించబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. గ్లిమ్స్ ను పరిశీలిస్తే దర్శకత్వ ప్రతిభ, కెమెరా వర్క్, మ్యూజిక్ అన్ని కరెక్ట్ గా కుదిరినట్లు తెలుస్తుంది.

నటీనటులు: నంద కిషోర్, రోజా, దుర్గా దేవ్ నాయుడు, వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్
నిర్మాత: నీలా మామిడాల
డైరెక్టర్: దుర్గా దేవ్ నాయుడు
మ్యూజిక్: ఎన్. ఎస్. ప్రసు
కెమెరామెన్: నాగ్ సోధనపల్లి
ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాధ్ కుచనపల్లి
లిరిక్స్: కిరణ్ ఓలేటి, రామ దుర్గం