ప్రపంచవ్యాప్తంగా ‘హను-మాన్’ చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు.
ప్రీక్వెల్ ముగింపులో ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్ ‘అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ కాన్వాస్, అగ్రశ్రేణి ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించబోతోంది.
ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచారు. ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని వారు భావించారు.
రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒకటి ప్రశాంత్ వర్మ హనుమంతుని ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు చూపిస్తే, మరొకటి సీక్వెల్ ప్రకటించిన హను-మాన్ నుండి చివరి సీక్వెన్స్‌ను చూపుతుంది.
ఈ మాగ్నమ్ ఓపస్ సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.