రికార్డులను బద్దలు కొడుతోన్న ‘అన్‌స్టాపబుల్’ ప్రభాస్ ప్రోమో!!

సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 డిసెంబర్ 30, 2022న బాహుబలి నటుడు ప్రభాస్ కనిపించనున్నారు. బాలయ్యతో ప్రభాస్, గోపిచంద్ చేసిన సందడిని ఈనెల 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలై సందడి చేస్తుంది. ఈ ప్రోమోను కోట్లలో .. ప్రభాస్ అభిమానులు, బాలయ్య అభిమానులు.. చూసేశారు. దీంతో ప్రభాస్ ప్రోమో రికార్డులు క్రియేట్ చేసేస్తోంది.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఆహా క్రియేట్ చేసిన పాత యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. కొద్దిసేపటికే, ప్రోమో 1.4 మిలియన్లకు పైగా లైక్‌లతో 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించింది ఇప్పటికీ ప్రోమో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది కేవలం ప్రోమో మాత్రమే. పూర్తి ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఎపిసోడ్ సృష్టించే రికార్డ్ ల గురించి నెటిజన్లు మాట్లాడుతున్నారు.

ఈ షోలో ప్రభాస్ ఫ్రెండ్ హీరో గోపిచంద్‌ ని కూడా ఇంటర్వూ చేశారు బాలయ్య . ఈ రేర్‌ కాంబినేషన్‌ని ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ ద్వారా ఆడియన్స్‌ని ఉత్తేజపరుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రభాస్‌ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత మంచి వింటేజ్ ఎనర్జీ తో ఉన్న ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ కూడా మంచి ఎమోషనల్ అవుతుండగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫుల్ ప్రోమో కేజ్రీగా మారింది.

ఇక దీంతో ఈ ప్రోమో కి ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్, గోపీచంద్ అలాగే రామ్ చరణ్ కాల్’తో బాలయ్య చేసిన రచ్చతో ఈ ఎపిసోడ్ ప్రోమోకు 12 గంటల్లో ఏకంగా 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. దీని బట్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ సహా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.

అయితే.. బాలయ్య గోపిచంద్, ప్రభాస్‌ను అనుష్క విషయంలో కూడా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఆ పేరు అయితే ప్రొమోలో కనిపించలేదు కానీ.. ఓ హీరోయిన్ ఫోటో చూపిస్తూ… బాలయ్య ప్రభాస్, గోపిచంద్‌ను ఆట పట్టించినట్లు తెలుస్తోంది. మనోడే పడేస్తాడో… కటౌట్ చూసి మనోడుకు పడిపోతారో అంటూ బాలయ్య ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కాదు.. ఎప్పుడూ హాట్ కేకే! సినిమాలతో పాటు..ఓటీటీలో టాక్ షో చేస్తూ దడ దడ లాడించేస్తున్నారు. తాజాగా అయనకున్న క్రేజ్ గురించి మాట్లాడలేం. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ NBK షో కి హోస్టుగా వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఏది అందరికీ తెలిసిందే! బాలయ్య సెకండ్ సీజన్‌లో అదిరిపోయే గెస్టులను షోలో పాల్గొనేలా చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ షోకు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ ప్రోమోకు అదరిపోయే రెస్పాన్స్ వచ్చేస్తోంది. ప్రభాస్ ప్రొమోకు ఇప్పటివరకు 1.4 మిలియన్లకు పైగా లైక్‌లతో 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఎక్కడవిన్నా వాహ్.. అన్‌స్టాపబుల్ అంటున్నారు. ప్రభాస్ ప్రోమోకు అదరిపోయే రెస్పాన్స్.. కోట్లలో వ్యూస్ వచ్చాయి.