Pathaan: పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్

Pathaan:  బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా పఠాన్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఏస్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం వంటి స్టార్లు నటించారు.

టీజర్ రిలీజ్ చేసిన అనంతరం డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. పఠాన్ గ్లింప్స్‌కు అంత ఆదరణ వస్తుందని మేం ఊహించలేదు. చాలా రోజుల తరువాత ఇలా ఓ సినిమా మీద ఇంత జెన్యూన్‌గా, ఆర్గానిక్‌గా బజ్ ఏర్పడటం పఠాన్ సినిమాకే సాధ్యమైంది. ఇదంతా కేవలం షారుఖ్ ఖాన్ వల్లే జరిగింది. ఆయనుకున్న అశేషమైన అభిమాన గణం వల్లే ఇదంతా సాధ్యమైంది. షారుఖ్ ఖాన్ బర్త్ డే కంటే మాకు ఇంకా మంచి రోజు దొరకదు. అందుకే ఈ టీజర్‌ను విడుదల చేశాం.

ఎన్నో దశాబ్దాల నుంచి షారుఖ్ ఖాన్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పఠాన్ సినిమా ఆయనకు సరైన కమ్ బ్యాక్ చిత్రం అవుతుంది. నాలుగేళ్ల తరువాత షారుఖ్ తన అభిమానులకు సరైన చిత్రాన్ని అందివ్వబోతోన్నారు. అలా ఇంతటి ఒత్తిడిలో ఆయన బర్త్ డేకు ఇలాంటి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాం. మేం ఆశించినట్టుగానే ఈ టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

ప్రస్తుతం పఠాన్ టీజర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. షారుఖ్ అశేషమైన అభిమానులను మేం సంతోష పర్చగలిగాం. అందుకే ఈ టీజర్‌ను షారుఖ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా రిలీజ్ చేశాం. మా వరకు పఠాన్ కేవలం సినిమా కాదు. ఇదొక ఎమోషన్. ఇది వరకు ఇండియన్ సినిమాలో ఎన్నడూ చూడని భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాం. టీజర్ అనేది కేవలం శాంపిల్. జనవరి 25న బ్లాక్ బస్టర్ హిట్ రాబోతోందని చెప్పడానికి ఈ టీజర్‌ను వదిలాం.

ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలు ఈ సినిమాలో కలిసి నటించారు. సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే వీరిద్దరి ఫోటోలు లీకై సంచలనంగా మారాయి. షారుఖ్ ఖాన్ ఎనిమిది పలకల దేహంతో, దీపిక పదుకొణె బికినీ అందాలతో చేసిన సాంగ్ ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. మార్చి 27న స్పెయిన్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

YouTube video player