పాపారావుగారు చేసిన ‘మ్యూజిక్ స్కూల్’ మే 12న రిలీజ్

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న‌ మ‌ల్టీ లింగ్వువ‌ల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మేక‌ర్స్ పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే శ్రియా శ‌ర‌న్ కొంత మంది పిల్ల‌ల‌తో క‌లిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ అల్ల‌రి చేస్తుంది. ఈ సందర్భంగా…

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ సినిమాపై ప్యాష‌న్ ఎలా ఉంటుంద‌న‌టానికి ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట‌ర్ పాపారావుగారు. ఆయ‌న అపాయింట్‌మెంట్ కోసం అంద‌రూ తిరుగుతుంటారు. అలాంటి వ్య‌క్తి సినిమాపై ప్యాష‌న్‌తో త‌న జాబ్‌కి రిజైన్ చేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్‌లో చాలా ప్రెజ‌ర్ ఉంటోంది. అందుకు మ‌రో ఎగ్జాంపుల్ నా మన‌వ‌డే. త‌న‌కు ఆరేళ్లు. త‌ను ఉద‌యం ఆరేడు గంట‌ల‌కే స్కూల్‌కి బ‌య‌లుదేరితే సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఇంటికొస్తాడు. అంటే తెలియ‌కుండా అంత ఒత్తిడి పిల్ల‌ల‌పై ఉంది. ఇది అన్ని ఫ్యామిలీస్‌లోఉండే సమ‌స్య‌. ఇప్పుడు పిల్ల‌ల‌పై ఎడ్యుకేష‌న్ వ‌ల్ల ఎంత ప్రెష‌ర్ ప‌డుతుంద‌నేది తెలియ‌జేసే చిత్ర‌మే మ్యూజిక్ స్కూల్‌. శ్రియా శ‌ర‌న్ మెయిన్ లీడ్‌గా, అంద‌రు చిన్న పిల్ల‌ల‌తో ఈ సినిమాను చేశారు. ఇదొక సీరియ‌స్ పాయింట్ కానీ దాన్ని వినోదాత్మ‌కంగా మ్యూజికల్ ఫిల్మ్‌గా చేశారు పాపారావుగారు. గ్రేట్ ఇళ‌య‌రాజాగారు సంగీతాన్ని అందించారు. మే 12న మూవీ రిలీజ్ అవుతుంది. చాలా రోజుల ముందు అభినంద‌న సినిమాలో ఎనిమిది పాట‌లు, ఇంకా ఎక్కువ పాట‌లతో హ‌మ్ ఆప్ కే హై కౌన్ సినిమాను ప్రేక్ష‌కులు చూశారు. అలా 11 పాట‌లతో మ్యూజిక్ స్కూల్ ఓ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తుంది. ఈ సినిమాను తెలుగులో మేం రిలీజ్ చేస్తున్నాం. మిగ‌తా నేష‌న‌ల్ వైడ్ పి.వి.ఆర్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో పాపారావుగారు చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పాట‌ల‌ను ఆదిత్య వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. అందుకు నిరంజ‌న్‌గారికి, ఉమేష్‌గారికి థాంక్స్’’ అన్నారు.

ఐఏఎస్ ఆఫీస‌ర్‌, సినిమా అంటే ప్యాష‌న్ ఉన్న పాపారావు బియ్యాల మ్యూజిక్ స్కూల్‌ చిత్రం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా త‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్‌, స‌మాజం పిల్ల‌ల‌పై చ‌దువు పేరుతో ఒత్తిడిని పెంచేస్తున్నారు. ఇలాంటి వాటి వ‌ల్ల వారిలో అభివృద్ధి జ‌ర‌గ‌టం లేదు, స‌రి క‌దా అదే వారి ఎదుగుద‌ల‌కు స‌మ‌స్య‌గా మారుతుంది. నిజానికి ఇదొక సీరియ‌స్ పాయింట్, అయితే దాన్ని సంగీత రూపంలో వినోదాత్మ‌కంగా చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించాం’’ అన్నారు.

కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుత‌మైన డాన్సుల‌ను కంపోజ్ చేశారు ఆడ‌మ్ ముర్రు, చిన్ని ప్ర‌కాష్‌, రాజు సుంద‌రం.

ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన‌, లీలా సామ్‌స‌న్స్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రానికి హిందీ, తెలుగు చిత్రీక‌రించి త‌మిళ‌లో అనువాదం చేసి మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్‌చేస్తున్నారు. హిందీలో పి.వి.ఆర్‌, తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు