ఇష్టపడి చేసిన కృషికి తార్కాణం మా ‘విధి’

ఇష్టపడి కష్టపడితే ప్రేక్షకుల నుంచి ఎంత గొప్ప ఫలితం వస్తుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ మా ‘విధి’ అని అంటున్నారు మేకర్స్. నటీనటులు, టెక్నీషియన్లు చేసిన కృషికి మంచి ఫలితం దక్కిందని ఆనందిస్తున్నారు. ప్యాషన్‌తో అహర్నిశలు శ్రమిస్తే సినిమాలు సిద్ధమవుతాయి.

కథ చెప్పాలన్న ఉత్కంఠ, అప్పటిదాకా ఊహల్లో ఉన్న పాత్రలకు ప్రాణం పోయాలనే అభిలాష అన్నీ కలగలిసి సినిమాను స్క్రీన్స్ మీదకు తీసుకెళ్తాయి. మా విధి చూసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం స్పష్టమవుతుంది.

రోహిత్‌ నంద, ఆనంది జంటగా నటించిన సినిమా విధి. వారిద్దరు ఎంత లీనమై నటించారో సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం విధి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఎంతో మంది టెక్నీషియన్ల నిర్విరామ కృషికి చిహ్నమే ఈ సినిమా. విధి విడుదలైనప్పటి నుంచి సూపర్‌డూపర్‌ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. థియేటర్లలోనూ గొప్పగా ఆడుతోంది.

నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంజిత్‌ ఎస్‌ మాట్లాడుతూ ”ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న మా సినిమా మీద థర్డ్ పార్టీ నెగటివ్‌ క్యాంపెయిన్‌ మొదలైంది. బుక్‌ మై షోలో నెగటివ్‌ రివ్యూలు చేస్తున్నారు. దీనివల్ల సినిమాకు భారీ నష్టం కలుగుతోంది. ఫేక్‌ రివ్యూలు, పిచ్చి క్యాంపెయిన్‌ వల్ల ఇబ్బంది కలుగుతోంది. మంచి సినిమాల మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలను క్షమించకూడదు. బుక్‌ మై షో నిర్వాహకులను మేం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాం. సినిమా జయాపజయాలను ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇలాంటి ఫేక్‌ రివ్యూలు కాదన్నది మా ప్రగాఢ నమ్మకం. థియేటర్లలో మా సినిమా ప్రేక్షకులను మెప్పించి తీరుతుందనే నమ్మకం మాకు ఉంది” అని అన్నారు.