కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న “సీతారాం సిత్రాలు” ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది: దర్శకుడు మారుతి.

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మన పాత రోజులను గుర్తు చేస్తూ… పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ సీతారాం చిత్రాలు. ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ… కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్, బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు: లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
BGM: శిరీష్ సత్యవోలు
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయభట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి

Seetharam Sitralu Official Concept Trailer | Lakshman,Bramarambika | Nagasasidhar Reddy