ఆహా లో అనూహ్య స్పందన తో దూసుకుపోతున్న నేనేనా సినిమా

తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన చాలా కాలమే అయినా ఎక్కడ క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రెజీనా కసాండ్రా .

రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో “నేనేనా” అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.

ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమా విభిన్నంగా , మంచి కంటెంట్‌తో, ఎవరు ఊహించని థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫారం ఆహా లో స్ట్రీమ్ అవుతుంది .ఓటీటీ లో ఎవరు ఊహించని అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమా స్పందన చూసి చిత్ర బంధం ఆనందం వ్యక్తం చేస్తున్నారు