మొన్నటి తరానికి సినీ కథా నాయకుడిగా నిన్నటి తరానికి ప్రజానాయకుడిగా నేటి తరానికి యుగపురుషునిగా తరతరాలకు తన్మయులను చేసే శక్తి ఉన్న నందమూరి తారకరామారావు. కాంస్య విగ్రహాన్ని 18.12.2022 మధ్యాహ్నం 12.20 గంటలకు గుంటూరు జిల్లా లోని పాలమర్రు పెదనందిపాడులో సినీ నటుడు నందమూరి తారకరత్న ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద రత్తయ్యతో పాటు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు ఇనగంటి జగదీష్ బాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు చాగంటి సత్యహర్ష, పెదనందిపాడు మండల మాజీ ఎంపీపీలు నర్రా బాలకృష్ణ, ముద్దన నగరాజకుమారి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మండల పార్టీ అధ్యక్షుడు విక్రయాల సుబ్బారావు, ఆయా గ్రామాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, నందమూరి అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.. యన్టీఆర్ విగ్రహా విష్కరణ అనంతరం…
నందమూరి తారక రత్న మాట్లాడుతూ…1982లో కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద బవంతి అని చెప్పవచ్చు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన ఏకైక మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. . ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తూ..అన్నా అని పిలిచినా ప్రతి ఆడపడుచుకు నేనున్నాను అంటూ పిలుపునిచ్చిన ఏకైక మహానుభావుడు ఆయన. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది అంటే అది ఎన్టీఆర్ గారని తెలియజేసు కుంటున్నాను. ఈరోజు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన అని పేర్కొన్నారు. ఈరోజు ఆయన కళలు కన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కళ్ళారా చూస్తున్నాం వింటున్నాం మన మాచర్ల కూడా ఏమైంది మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మన భావి తరాల వారు సుఖంగా బతకాలన్నా..మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా..మన మందరము కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకు రావాలని అందరిని కోరుకుంటూ దానికోసం మన మందరం ముఖ్యంగా నేను ఈరోజు నుంచి నా అడుగు జనాల వైపు, నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని అందరికీ తెలియ జేసుకుంటూ… ఆ మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబుకి అబ్బాయిగా, మా చంద్రబాబు నాయుడు మేనల్లుడు గా, మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వదాలే శ్రీ రామ రక్షగా ముందుకు వెళ్ళడానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. చివరగా ఆయనకి అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడు సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా అంతా మా బాబాయ్ బాలయ్య బాబే అని మీ అందరికీ చేసుకుంటూ..అయన సైన్యాధ్యక్షుడైతే మనమంతా సైనికుల్లా పని చేయాలని కోరుకుంటూ..జై బాలయ్య, జై జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయకత్వం..జై తెలుగుదేశం పార్టీ అంటూ ముగించారు.