‘నడికర్ తిలకం’తో మలయాళంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్

స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో “నడికర్ తిలకం” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ని రూపొందించిన లాల్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి మలయాళ చిత్రాన్ని గాడ్‌స్పీడ్‌తో కలిసి నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

“‘నడికర్ తిలకం” ముహూర్తం వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు కొచ్చిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. టోవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన కథానాయిక.

ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ఉంది. ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమా కోసం పని చేస్తున్నారు. ఆల్బీ సినిమాటో గ్రాఫర్ గా ఉత్కంఠభరితమైన దృశ్యాలను తెరపై ఆవిష్కరించనున్నారు. రతీష్ రాజ్ ఎడిటింగ్ సినిమా అంతటా మనల్ని సీట్ల ఎడ్జ్ లో ఉంచుతుంది. యక్జాన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీతం సినిమా భావోద్వేగాలకు అనుగుణంగా సరికొత్త అనుభూతిని అందించబోతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రశాంత్ మాధవ్ కథకు తగిన అద్భుతమైన సెట్‌లను రూపొందించారు.

తారాగణం: టోవినో థామస్, భావన, సౌబిన్ షాహిర్, ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్, బాలు వర్గీస్, సురేష్ కృష్ణ, ఇంద్రన్స్, మధుపాల్, గణపతి, అల్తాఫ్ సలీం, మణికుట్టన్, శ్రీజిత్ రవి, సంజు శివరామ్ , అర్జున్, వీణా నందకుమార్, ఖలీద్ రెహమాన్, ప్రమోద్ వెలియనద్, ఇడవల బాబు, బైజుకుట్టన్, అరుణ్ కురియన్, షాన్ జేవియర్, రజిత్ (బిగ్ బాస్ ఫేమ్), బిపిన్ చంద్రన్, మాలా పార్వతి, దేవికా గోపాల్ నాయర్, ఆరాధ్య, అఖిల్ కన్నపన్, ఖయాస్ ముహమ్మద్, జజీర్ ముహమ్మద్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లాల్ జూనియర్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అలన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, గాడ్‌స్పీడ్
డీవోపీ: ఆల్బీ
సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్
స్క్రీన్ ప్లే: సువిన్ ఎస్ సోమశేఖరన్
ఎడిటింగ్: రతీష్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్: ప్రశాంత్ మాధవ్
పీఆర్వో: వంశీ-శేఖర్