కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా 2018 చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.
*నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ…*
కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుంది మలయాళం సినిమాలలో, కథను చాలా స్ట్రాంగ్ గా చెబుతారు. 2018 వరదలు వచ్చినప్పుడు నేను, దర్శకుడు మారుతీ గారు కేరళలోనే ఉన్నాం. శైలజ రెడ్డి అల్లుడు రీ రికార్డింగ్ లో. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు, ఇంట్లోకి వరదలు వచ్చిన ఫీల్ వచ్చింది. బన్నీ వాసు గారు ఎక్కడ మంచి సినిమా ఉన్న అక్కడ కర్చీఫ్ వేస్తారు. కానీ వాసు గారు ఈ సినిమాకి టవల్ వేశారు. డైరెక్టర్ జ్యూడ్ గారు తెలుగులో ఒక సినిమా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. మీడియా ఈ సినిమాకి మంచి సపోర్ట్ చేసింది. థాంక్యూ.
*అపర్ణ బాలమురళి మాట్లాడుతూ…*
ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థాంక్యూ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఇంత సపోర్ట్ ఇవ్వడం మాములు విషయం కాదు. 2018 సినిమాలో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్. చాలా డబ్బింగ్ సినిమాల ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను.ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమా ప్రొమోషన్స్ కి వస్తాను.
*నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…*
ముందుగా తెలుగు మీడియాకు థాంక్స్ చెబుతున్నాను. పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా నేను నమ్మింది ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని. ఆ కదిలించడమే నా పబ్లిసిటి అని నమ్మాను. నేను 16, 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేసాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూ లు వచ్చాయి. 2018 లో మా గీత గోవిందం అక్కడ తెలుగులో రిలీజ్ చేసి వచ్చిన ఫండ్స్ ను కేరళకు ఆ టైం లో ఫండ్ గా ఇచ్చాము. బహుశా అందుకేనేమో నాకు ఈరోజు ఈ సినిమాను తెలుగులో చూపించే అవకాశం వచ్చింది. టోవినో థామస్ గారు మీకు తెలుగులో అవకాశం వస్తే సినిమాను చెయ్యండి. ఇలాంటి సినిమాలను మనం ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. మలయాళం ప్రొడ్యూసర్స్ వేణు గారికి,ఆంటోని గారు, పద్మ కుమార్ గారికి థాంక్యూ. డబ్బింగ్ టీం కి కూడా చాలా థాంక్యూ. అందరికి థాంక్యూ సో మచ్.
*దర్శకుడు జ్యూడ్ ఆంటోని మాట్లాడుతూ…*
అందరికి చాలా థాంక్యూ. మీరు ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా చూసి చివర్లో చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చాలా థాంక్యూ మా సినిమాను ఆదరించినందుకు. మా ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్యూ. బన్నీవాసు గారు 63 లక్షలు 2018 లో కేరళకి ఫండ్స్ ఇచ్చారు. యాదృచ్చికంగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డ్రిస్టుబ్యూట్ చేసారు. బన్నీవాసు సెల్ఫ్ లెస్ పర్సన్. మమ్మల్ని ప్రేక్షకులు , మీడియా బాగా ఆదరించారు.మమ్మల్ని మీరు ట్రీట్ చేసిన విధానం చాలా హ్యాపీ అనిపించింది.ఈ సినిమాను మీరు థియేటర్ లో చూడండి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు.
*హీరో టోవినో థామస్ మాట్లాడుతూ….*
13 సంవత్సరాల క్రితం కాలేజ్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చాను, కోయంబత్తూరు లో చదువుకునేటప్పుడు. నావి కొన్ని డబ్ సినిమాలు ఆహా వీడియోలో ఉన్నాయి. మొదటి సారి ఈ సినిమా ప్రొమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఈ సినిమాను ఊహించని స్థాయిలో రిసీవ్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ. మా హార్డ్ వర్క్ ను అప్రీసెట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్యూ. 2108 సినిమాను ఆదరించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఖచ్చితంగా నా తర్వాత సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను, ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమను ఎవరు వదులుకోవాలి అనుకోరు. ఈ సినిమాకి కేరళలో మాత్రమే కాకుండా అన్నిచోట్లా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్, బట్ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను.