Mufti Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” నవంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘ముఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించారు.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 21న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అర్జున్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది.

ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు.

శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఆశివాగన్ సంగీతం అందిస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్. అరుణ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్,

ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Bihar Assembly Elections 2025: Big Tension Started In BJP | Tejashwi Yadav | Telugu Rajyam