విజయనిర్మల గారి మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) హీరోగా, శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్టర్ కింగ్’. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలుగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న ‘మిస్టర్ కింగ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. నరేష్, నిర్మాత ఎంఎస్ రాజు ముఖ్య అతిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ..‘మిస్టర్ కింగ్’ ట్రైలర్ చాలా ప్రామెసింగా వుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు సైన్స్ ఫిక్షన్ కూడా కనిపిస్తోంది. చాలా ఇంటెన్స్ గా వుంది. చాలా క్యురియాసిటీని పెంచింది. నాకు చాలా నచ్చింది. ఈ చిత్రంతో మా అల్లుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. బహుసా మా కుటుంబం నుంచి ఎనిమిదో హీరో. కృష్ణ గారు విజయ నిర్మల గారు సినిమా అనే బీజాన్ని కుటుంబంలో నాటారు. దాని నుంచి ఇంతమంది ఎదిగివచ్చాం. నేను సినిమాల్లోకి యాభై ఏళ్ళు అవుతుంది. నా ఏడువ ఏటా సినిమాల్లోకి వచ్చాను. మా జీవితమే సినిమా. శరణ్ చాలా కష్టపడ్డాడు. చాలా ఫోకస్ పెట్టి మంచి సినిమాతో రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా శరణ్ కి మంచి భవిష్యత్ ని ఇస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు శశిధర్ చావలిలో చాలా మంచి సృజన వుంది. ప్రతి పాత్రని అద్భుతంగా మలిచారు. నిర్మాత చాలా రిచ్ గా తీశారు. అద్భుతమైన నటులు నటించారు. మణిశర్మ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. శరణ్ కి, ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు, ఫ్యామిలీ బ్లెసింగ్స్ వున్నాయి. దీనితో పాటు సాయి ధరమ్ లాంటి వాళ్ళు విష్ చేయడం చూస్తుంటే సంతోషంగా వుంది. ఇదే పాజిటివ్ వైబ్రేషన్స్ లో విడుదలై పెద్ద విజయం సాధించాలి. టీమ్ అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. మిస్టర్ కింగ్ ట్రైలర్ చాలా ప్రామెసింగా వుంది. కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది. శరణ్ కి అల్ ది బెస్ట్. నిర్మాతలు టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని కోరారు
శరణ్ మాట్లాడుతూ.. మిస్టర్ కింగ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. చాలా బలమైన పాత్రతో పాటు ఫ్యామిలీ, లవ్, స్ట్రగుల్స్, గోల్ వున్న కంప్లీట్ ఫన్ ప్యాకేజీ. దర్శకుడు చాలా ప్యాసన్ తో సినిమా చేశారు. అంటే ప్యాసన్ తో నిర్మాత రావు గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మణిశర్మ గారు వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందికీ పేరుపేరునా కృతజ్ఞతలు. కృష్ణ తాత, విజయనిర్మల గారి దీవెనలతో లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు, మహేష్ అన్న అభిమానులకు కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు, వంశీ శేఖర్ గారికి కృతజ్ఞతలు. మిస్టర్ కింగ్ ని థియేటర్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పారు.
నిర్మాత బిన్ రావు గారికి.. ఈ వేడుక కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన నరేష్ గారికి, ఎంఎస్ రాజు గారికి కృతజ్ఞతలు. దర్శకుడు శశి మిస్టర్ కింగ్ సినిమాని అద్భుతంగా తీశారు. ఎన్విరాల్ మెంట్ ఏరోప్లేన్స్ గురించి ఏడాది పాటు రీసెర్చ్ చేసి ఈ కథని చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ 24న సినిమాని థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.
రాజ్ కుమార్ మాట్లాడుతూ.. శిశిగారు కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. డిఫరెంట్ జోనర్. ఈ సినిమాలో నన్ను ఫాదర్ గా నటించమని కోరారు. శరన్ కి నాకు అవకాశం ఇచ్చిన బిఎన్ రావు గారు, శశిగారికి కృతజ్ఞతలు. అందరూ థియేటర్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను’
శశిధర్ మాట్లాడుతూ.. ఆత్మాభిమానం వున్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునే కథ ఇది. సినిమాలో చాలా అద్భుతమైన విషయాలు వున్నాయి. ఈ మధ్య స్క్రీన్ వేసినపుడు చివర్లో కన్నీళ్లు వచ్చాయని చూసిన వారు చెప్పారు. 24న ఇన్ని మంచి విషయాలు వున్న సినిమా చూస్తారు. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. యూత్ విజల్స్ వేసే చాలా బ్లాక్స్ ఇందులో వున్నాయి. సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళినపుడు ఒక చిరునవ్వుతో వెళ్తారు. 24న అందరం థియేటర్లో కలుద్దాం’’ అన్నారు
ఊర్వీ సింగ్ మాట్లాడుతూ.. మిస్టర్ కింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబం అందరికీ కలసి చేసే సినిమా ఇది. మంచి కథ, మ్యూజిక్, అద్భుతమైన నిర్మాణ విలువలు ఉన్న చిత్రమిది. అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు,
యశ్విక మాట్లాడుతూ..ఈ సినిమాలో ఆవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మిస్టర్ కింగ్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. 24న అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు. రవి కిరణ్, అంజలి, శ్వేత, శ్రీనివాస్, తన్వీర్ తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.