సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి మిల్కీ బ్యూటీ సోకుల విందు!

మీకో విషయం తెలుసా.. ? సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి మిల్కీ బ్యూటీ తమన్నా సోకుల విందు చేస్తోంది! విషయాల్లోకి వెళితే.. ‘బబ్లీ బౌన్సర్‌’గా యాక్ట్ చేసిన సౌత్ గార్జియస్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తమన్నా వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే పదిహేనేళ్లు గడచిపోయాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ 15 ఏళ్లలో దాదాపు యాభైకి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది.

‘ఎఫ్‌3’ సక్సెస్‌ తర్వాత ‘బాబ్లీ బౌన్సర్‌’గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించిన తమన్నా..తాజాగా చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమాను చేస్తోంది. ‘భోళా శంకర్’ తమిళ ‘వేదాళం‌’కు రీమేక్‌గా వస్తోన్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా నటించిన నితిన్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.

తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటించింది. కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సౌత్‌లో కాకపోయినా నార్త్‌లో కూడా తమన్నాకు ఆఫర్లు పుష్కలంగా వస్తున్నాయట. ఆమె అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య సౌత్ స్టన్నింగ్ బ్యూటీ తమన్నా భాటియా జీన్స్ డ్రెస్‌లో హాట్‌ ఫోజులిచ్చి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోందిట! ఈ అమ్మడి లుక్స్ కి నెటిజనులు ఫిదా అవుతున్నారు.

తమన్నాకు సోషల్ మీడియా ఫాలోవర్స్‌ ఎక్కువే అని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ ను ఆనందడోలికల్లో ముంచెత్తాలనేదే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ని కంటి చూపుతో కట్టిపడేస్తూ మరోసారి తన సోకుల విందు ఇచ్చింది. కొత్తకొత్త ఫోటోషూట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తన లేటెస్ట్ లుక్స్‌తో అందరి కళ్లు తనవైపు తిప్పుకుంటోంది.

ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు వెరైటీ కామెంట్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈఫోటోలకు లక్షల్లో వ్యూస్‌ వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాయి. తమన్నా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ కలర్‌ఫుల్‌ ఫోటోలతో ఫ్యాన్స్‌, కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తమన్నా దర్శకుడు మధూర్‌ బండార్కర్ కాంబోలో వచ్చిన ‘బబ్లీ బౌన్సర్’ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈజోష్‌లోనే లోక్‌మత్ అవార్డ్ అందుకోవడం హ్యాపీగా ఉందని కామెంట్‌ షేర్ చేసింది తమన్నా.

తమన్నా తాజా ఫోటోలు చూస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తూ ఆమెని ఆట పట్టిస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి మిల్కీ బ్యూటీ సోకుల విందు చేస్తోంది. ఈ విధంగానైనా తను బాగా బిజీగానే ఉంటున్నట్టు తెలియపరుస్తోందన్నమాట!