నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో హవీష్, సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ త్రినాధ రావు నక్కినతో కలిసి కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ చేస్తున్నారు. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మాస్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన, మెలోడీ కంపోజర్ మిక్కీ జె మేయర్ కలిసి పని చేయడంతో ఈ సినిమాలో మాస్, మెలోడియస్ ట్యూన్‌ల కలయికను ఆశించవచ్చు.
ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన నేను రెడీ అనే టైటిల్ మంచి రెస్పాన్స్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది.
ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీన, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అందిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.
తారాగణం: హవీష్, కావ్య థాపర్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

