ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ ఆహా. ఈ సెప్టెంబర్ 15, శుక్రవారం నుంచి అందరిలో ఆసక్తిని రేకెత్తించి అలరించిన వైవిధ్యమైన చిత్రం ‘మాయా పేటిక’ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి డైరెక్ట్ చేశారు. రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కిన ‘మాయా పేటిక’ సినిమా పాయింట్, అందులో నటించిన టాలెంటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు ఈ చిత్రంలో నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది.
ఓ నిర్మాత టాలీవుడ్ స్టార్ పాయల్ (పాయల్ రాజ్‌పుత్)కి ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా ఇస్తాడు. ఆ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరిగే కథతో సినిమా తెరకెక్కింది. ఆ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను గమనించిన పాయల్ తనకు తెలియకుండానే ఫోన్‌తో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. అయితే అనుకోని సమస్య రావటంతో ఆ ఫోన్‌ని తన అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ తన సాహసయాత్రను కొనసాగించటం మొదలు పెడుతుంది. ఒక్కొక్కరి చేతులు మారుతూ వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల చేతుల్లోకి అది చేరుతుంది. ఆ ఫోన్‌ను సొంతం చేసుకున్న ప్రతీ వ్యక్తి అనిర్వచనీయన అనుభూతికి లోనవుతాడు. అయితే ఈ ఫోన్ ఒక సాధనమే కదా, మరి ఇది మన చేతుల్లో ఉండటం అనేది వరమా? శాపమా? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.
‘మాయా పేటిక’అనేది స్మార్ట్ ఫోన్ గురించి, దానితో ముడిపడిన యజమానుల గురించిన ఆకట్టుకునే ఘటనలను, హాస్యభరితమైన పరిస్థితులను మనకు పరిచయం చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, సర్‌ప్రైజింగ్ చేస్తూనే స్మార్ట్ ఫోన్ అందరి మధ్య తెలియని ఓ బంధాన్ని ఏర్పరుస్తుంది. వ్యక్తులను ఒకచోటికి తీసుకురావటమే కాదు.. వారి మధ్య బంధాలను గురించి కూడా ఆలోచింపచేసేలా చేస్తుంది.
‘మాయా పేటిక’ చిత్రాన్ని మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. గుణ బాల సుబ్రమణియన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అందరి జీవితాల్లో మనకు తెలియకుండానే ఓ మాయాజాలాన్ని ఏర్పరిచిన స్మార్ట్ ఫోన్ అందరినీ మంత్ర ముగ్దులను చేస్తుంది. ఆ ప్రపంచాన్ని సెప్టెంబర్ 15న ఆహాలో మాయా పేటిక చిత్రం ద్వారా వీక్షించటానికి సిద్ధంగా ఉండండి.