9 మార్చి 2023. కోచర్ చిల్డ్రన్స్ వేర్ లేబుల్ “MAISON AVA” ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ లో ప్రారంభించినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది.
లండన్ హారోడ్స్ లో “MAISON AVA” యొక్క మొదటి స్టోర్, నాల్గవ అంతస్తులోని మినీ సూపర్ బ్రాండ్స్ ప్రాంతంలో మీకు దర్శనమిస్తుంది. ఇక్కడ 2-14 సంవత్సరాల అబ్బాయిలు మరియు అమ్మాయిల కోసం “MAISON AVA” యొక్క షో-స్టాపింగ్ కోచర్ మెటీరియల్స్ ఉన్నాయి.
హారోడ్స్ కోసం ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన ఈ ఎడిట్, బిజీగా ఉండే పార్టీ సీజన్ మరియు ఈద్‌కు ముందే వచ్చింది. “MAISON AVA” యొక్క అద్భుతమైన ఆనువంశిక విలువ కలిగిన మెటీరియల్ సేకరణ, పిల్లలు జీవితాల్లో వచ్చే అత్యంత సంతోష సందర్బాలలో ఈ దుస్తులు ధరించడం ద్వారా ఆ క్షణాలకి మరింత విలువ జోడింపబడుతుంది .
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కోచర్ హౌస్‌లలో శిక్షణ పొందిన నిపుణులైన డిజైనర్లు , ఎంబ్రాయిడరీల ద్వారా ప్రతి ఒక్క “MAISON AVA” వస్త్రం చేతితో తయారు చేయబడింది. వందల గంటల చేతిపని ఒక వస్త్రాన్ని తయారు చేయడంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు వివరాలతో ప్రతి భాగాన్ని ఉన్నతంగా ఉంచుతుంది.
“MAISON AVA” డిజైన్లలో పిల్లల సౌకర్యమే ప్రధానమైనది, అందుకే పూసలు కళాత్మకంగా ఉంచబడ్డాయి. ప్రతి వస్త్రం యొక్క ఆకారాలు వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయి, తద్వారా పిల్లలు ధరించడానికి ఇష్టపడే దుస్తులలో వారు సులభంగా కదలవచ్చు.
“హారోడ్స్లో లో మా బ్రాండ్ ఓపెన్ చేయాలనే నా కల నిజమైంది. నలుగురి పిల్లలు కి తల్లిగా, నేను చాలా సంవత్సరాలు హారోడ్స్ లో కస్టమర్‌గా ఉన్నాను, కాబట్టి షాప్ ఫ్లోర్‌లో మా దుస్తులు చూడటం చాలా ఆనందంగా ఉంది. “MAISON AVA” అనేది నా అభిరుచికి, అత్యుత్తమ భారతీయ హస్తకళతో కలిపిన ఫలితం. విశిష్ట అభిరుచి కలిగిన హారోడ్స్ కస్టమర్‌లకు మా దుస్తులను ప్రదర్శించడానికి నేను సంతోషిస్తున్నాను. వారు మా డిజైన్లు ఇష్టపడతారని ఆశిస్తున్నాను.” అని “MAISON AVA” వ్యవస్థాపకురాలు మరియు క్రియేటివ్ డైరెక్టర్ విరానికా మంచు వ్యాఖ్యానించారు.
మరింత సమాచారం కోసం దయచేసి www.maisonava.com ని సందర్శించండి.
విరానికా మంచు ప్రొఫైల్ :
“MAISON AVA” వ్యవస్థాపకురాలు, క్రియేటివ్ డైరెక్టర్ అయిన విరానికా మంచు న్యూయార్క్ లో పుట్టి అక్కడే విద్యాభ్యాసం చేసింది. ఆమె చిన్న వయస్సులోనే డిజైన్ మరియు లగ్జరీ పట్ల మక్కువ పెంచుకుంది. నగల డిజైన్, జెమాలజీ మరియు ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీలను అభ్యసించింది. ఆమె చదువు తర్వాత, నగల రూపకల్పనలో తన అనుభవాన్ని విస్తృతం చేసుకోవడానికి ఆమె తన స్వదేశమైన భారతదేశానికి వెళ్లింది.
విరానికా, ప్రముఖ నటుడు, నిర్మాత మరియు వ్యాపారవేత్త అయిన విష్ణు మంచు భార్య. పెరుగుతున్న కుటుంబంతో, ఆమె తన చిన్నపిల్లల కోసం ఆలోచనాత్మకంగా తయారు చేసిన సందర్భోచిత దుస్తుల కోసం తన శోధనను ప్రారంభించింది. ఆమె వెతుకుతున్న స్థాయి నైపుణ్యం కనపడనప్పుడు, ఆమె వారి స్వంత పార్టీ wardrobes తానే రూపొందించింది. ఆమె డిజైన్‌లు త్వరగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అదే “MAISON AVA” ప్రారంభించేందుకు విరానికాను ప్రేరేపించాయి.
ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి మరియు ఫ్యాషన్ పట్ల ఆమెకున్న ప్రేమతో , విరానికా పూర్తిగా పనిచేసే భారతదేశ-ఆధారిత అటెలియర్‌ను నిర్మించింది, ఇక్కడ “MAISON AVA” యొక్క క్రియేషన్‌లు ప్రారంభం నుండి ముగింపు వరకు తయారు చేయబడతాయి. నేయడం, అలంకారం చేయడంల, వినూత్న శైలి కట్‌లు మరియు డిజైన్‌లతో వాటిని మిళితం చేయడంలో దేశం యొక్క ప్రత్యేకమైన హస్తకళను కాపాడేందుకు ఆమె కట్టుబడి ఉంది.