11న అమెజాన్‌లోకి వస్తోన్న ‘మహావీరుడు’

ఈ మధ్య తమిళంలో అత్యంత వేగంగా హిట్లు విూద హిట్లు కొడుతూ టాప్‌ హీరో రేంజ్‌కు దూసుకెళ్తున్నాడు శివ కార్తికేయన్‌. ఆయన సినిమా వస్తుందంటే ఏ సెంటర్‌లతో పాటు బీ, సీ సెంటర్‌లలో కూడా టిక్కెట్‌లు భారీ సంఖ్యలో తెగుతుంటాయి. సైడ్‌ క్యారెక్టర్‌ రోల్స్‌ నుంచి తొలిరోజు పాతిక కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ వసూళ్‌ చేసే స్థాయికి వెళ్లిపోయాడు. తెలుగులోనూ శివ కార్తికేయన్‌కు మంచి మార్కెటే ఉంది. రెమో, డాక్టర్‌, డాన్‌ వంటి సినిమాలతో ఇక్కడ మార్కెట్‌తో పాటు క్రేజ్‌ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే నేరుగా తెలుగులో చేసిన ప్రిన్స్‌ మాత్రం బెడిసి కొట్టింది.

ఇక ఇటీవలే ఆయన నటించిన మహావీరుడు సైతం తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పైగా అదే రోజున రిలీజైన బేబి ఈ సినిమాకు గట్టి పోటినిచ్చింది. దాంతో తెలుగులో బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకోకుండానే దుకాణం సర్దేసిరది. అయితే తమిళంలో మట్టుకు ఈ సినిమా బంపర్‌ హిట్టయింది. ట్రేడ్‌ సైతం ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది.

ఆగస్టు 11న అమెజాన్‌ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్‌కు జోడీగా శంకర్‌ తనయిక అదితి శంకర్‌ నటించింది. సునీల్‌ కీలకపాత్రలో నటించని ఈ సినిమాను శాంతీ టాకీస్‌ బ్యానర్‌పై అరుణ్‌ విశ్వ నిర్మించాడు.