Laggam : సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అచ్చ తెలుగు టైటిల్ తో, ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రమేశ్ చెప్పాల రూపొందించారు. సాఫ్ట్ వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి రోనక్, ప్రగ్యా నాగ్ర రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా లగ్గం (Laggam ) గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సప్తగిరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. “నిర్మాత వేణు గోపాల్ రెడ్డి గారు ఇలాంటి సాంప్రదాయ బద్దమైన సినిమాతో మన ముందుకు వచ్చారు. లగ్గం చిత్రం ద్వారా ఆయనకి మూడింతలు లాభాలు కట్న కానుకలుగా రాబోతున్నాయి. రమేశ్ చెప్పాల లాంటి రచయిత, దర్శకుడు టాలీవుడ్ కి చాలా అవసరం. లగ్గం చిత్రం తర్వాత ఆయన 25 ఏళ్ళు టాలీవుడ్ లో వెలుగు వెలుగుతారు” అని సప్తగిరి ప్రశంసించారు.
నిర్మాత వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎంతో మంది కలసి పనిచేస్తే ఒక సినిమా పూర్తవుతుంది. లగ్గం చిత్రంతో ఒక మంచి మెసేజ్ ని అందంగా చెప్పాలని అనుకున్నాం. ఆ విషయంలో దర్శకుడు రమేష్ చెప్పాల సక్సెస్ అయ్యారు. ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించిన మా దర్శకుడు రమేష్ గారికి కృతజ్ఞతలు.
Laggam: వినూత్న తరహాలో లగ్గం సినిమా ట్రైలర్ లాంచ్
తెలంగాణ వుమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా మాట్లాడుతూ..”స్కిన్ షో చేస్తేనే సినిమా ఆడుతుంది అని భావించే రోజుల్లో.. ఎలాంటి స్కిన్ షో లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. లగ్గం లాంటి చిత్రాలని ఆడియన్స్ ప్రోత్సహించాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది” అని ఆమె తెలిపారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ: “లగ్గం చిత్రం ఒక తండ్రీ కూతుళ్ళ కథ. ఇటీవలే నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాది 47 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్. లాంగ్ ఇన్నింగ్స్. దర్శకుడు రమేష్ చెప్పాలతో మీ శ్రేయోభిలాషి చిత్రం నుంచి అనుబంధం ఉంది. ఆ చిత్రానికి ఆయన రచయితగా పనిచేశారు. నిర్మాత వేణు గోపాల్ కి రిలీజ్ కి ముందే కంగ్రాట్స్ చెబుతున్నా.. ఎందుకంటే లగ్గం చిత్రంలో ఉన్న కంటెంట్ అలాంటిది. లగ్గం చిత్రంలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం” అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
దర్శకుడు రమేశ్ చెప్పాల మాట్లాడుతూ: “తెలంగాణ నేపథ్యంలో బలమైన కథ చెప్పాలని, అది మీ అందరి కథ అవ్వాలని ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఈ చిత్రం ఇంత సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది అంటే అందుకు కారణం నిర్మాత వేణుగోపాల్ గారు. లగ్గం చిత్రం అరిటాకులో వడ్డించిన విందు భోజనంలా ఉంటుందని” దర్శకుడు అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ: “రెండు విషయాల వల్ల లగ్గం చిత్రాన్ని తాను తప్పకుండా చేయాలని అనుకున్నట్లు తెలిపారు. డైరెక్టర్ నాకు కథ చెప్పే సమయంలో చాలా సందర్భాల్లో నా కళ్ళు చెమ్మగిల్లాయి. కథ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంది. ఇక రెండవ విషయం రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించడం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఆయనతో పోటీగా నటించడం పెద్ద ఛాలెంజ్. ఆ అవకాశం నాకు దక్కిందని” రోహిణి తెలిపారు.
ఈ చిత్రాన్ని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారు నిర్మించారు.
తారాగణం: సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి,కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు.
సాంకేతిక సిబ్బంది:
ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.