Laggam: వినూత్న తరహాలో లగ్గం సినిమా ట్రైలర్ లాంచ్

Laggam Movie: సినిమా ప్రమోషన్స్ కొత్తగా చెయ్యాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకెళ్లాలి అని ఉద్దేశంతో డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు “లగ్గం” టీమ్. రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్తో టీజర్ , ట్రైలర్స్ లాంచ్ చేపించడం అనేది మనం చూస్తున్నదే.

కానీ వీటన్నింటినీ దాటి ఇప్పటివరకు ఎవ్వరు చెయ్యని విధంగా తమ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. లగ్గం సినిమా టీమ్. సినిమా మొదలుకొని పాటలు, పోస్టర్స్, టీజర్ అంటూ వరుసగా రోజు ప్రేక్షకులను పలకరిస్తూ “రీల్ పెట్టు – చీరపట్టు” అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఒక వైపు లగ్గం ట్రావెలర్ ఊరూరా తిరుగుతూ లగ్గం గిఫ్ట్స్ అందిస్తూ అందరికీ చేరువ అవుతుంది. అదే తరహాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీమ్.

Laggam Movie Trailer: https://youtu.be/acJY41etfDA?si=XnLzYdEeS936S9oP

Laggam Movie: ‘రీల్ పెట్టు – చీర పట్టు’ వినూత్నంగా ‘లగ్గం’ చీరల పండుగ

లగ్గం సినిమా ట్రైలర్ ని ఒరిజినల్ గా లగ్గం చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేపించింది. ఇంజాపూర్ SPR శ్రీరస్తు కన్వెన్షన్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో లగ్గం సినిమా టీమ్ అంతా పాల్గొని వధూవరులు మండపంలోనే గోవర్ధన్ అనూషల చేత లగ్గం సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. లగ్గం టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ కి ఆ లాగ్గానికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్య పోవడమే కాక వెరైటీ సినిమా ప్రమోషన్ చూసి అభినందించారు. ఇది లైఫ్ లాంగ్ మాకు గుర్తుండి పోయే లగ్గం అని వధూవరులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు ” రమేష్ చెప్పాల ” చిత్ర నిర్మాత సుభిషి ఎంటర్టైనమెంట్స్ అధినేత వేణుగోపాల్ రెడ్డి గారు , చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Laggam Movie: అక్టోబర్ 25న “లగ్గం” విడుదల !!!

 

నటీనటులు: సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల,

నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి,

నేపధ్య సంగీతం: మణిశర్మ,

కెమెరామెన్: బాల్ రెడ్డి.

సంగీతం:చరణ్ అర్జున్.

ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.

కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.

పిఆర్ఓ: శ్రీధర్

కాలర్ ఎగరేసిన జగన్ || Ys Jagan Ura Mass Warning To Chandrababu & Pawan Kalyan Govt || TR