కృతి సనన్ ఇప్పుడు నేషనల్ అవార్డు పొందిన యాక్ట్రెస్. ఈ విషయాన్నే చెబుతూ, ఈ గుర్తింపు తనకు అప్పనంగా రాలేదని అంటున్నారు కృతి. మనం ఒక స్థాయికి ఎదిగాం అంటే… దాని అర్థం, ఎన్నెన్నో మింగుడు పడని అనుభవాలను గుండెల్లో దాచుకున్నామనే… అంటున్నారు కృతి. నలుగురి ముందు అవమానాలు కొన్నిసార్లు తప్పవని చెప్పారు.
మోడలింగ్ చేసే సమయంలో తనకు అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయంటున్నారు ఈ బ్యూటీ. ఒక సారి హై హీల్స్ వేసుకుని బురదలో డ్యాన్స్ చేయలేకపోయినప్పుడు కో ఆర్డినేటర్ అందరి ముందు చెడామడా తిట్టారని, తన తప్పు లేకపోయినా పడినట్టు చెప్పారు. ఎవరో ఏదో అన్నారని ఆగిపోకూడదని అప్‌కమింగ్ హీరోయిన్లకు తనవంతుగా సలహా ఇస్తున్నారు కృతి.
మన మీద మనకు నమ్మకం, మన ప్రతిభ మీద నమ్మకం ఎప్పుడూ ఉండాలని చెప్పారు. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అసలు పట్టించుకోకూడదని, కాకపోతే వాటి వల్ల ఎంతో కొంత నేర్చుకోవాలని చెబుతున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు కృతి సనన్. ఇటీవల ప్రభాస్‌తో నటించిన ఆదిపురుష్ థియేటర్లలో పెద్దగా ఆడలేదు.
అయినా ఆ సినిమాలో సీతమ్మ తల్లిగా కృతి మెప్పించారనే అన్నారు సినీ విమర్శకులు. మన పని మనం వంద శాతం చేసినప్పుడు హాయిగా నిద్రపడుతుందన్నది కృతి నమ్మే ఫిలాసఫీ. మీ దగ్గర వెయ్యి రూపాయలున్నాయి.
వాటిలో వంద రూపాయలను పోగొట్టుకున్నారు. ఆ వందా పోయిందని దిగులుపడుతూ, చేతిలో ఉన్న 900 రూపాయలను కూడా వదిలేసుకుంటారా? లేదు కదా… ఈ 900ని జాగ్రత్త చేసుకుంటారు కదా… యస్… అలా చేసుకోవడమే తెలివైన వాళ్ల పని. నేను చేసింది కూడా అదే అంటూ చెప్పబోయే విషయాన్ని ఎగ్జాంపుల్‌తో ఎక్స్ ప్లెయిన్ చేశారు కృతి సనన్!